Latest

Sunday, March 3, 2019

March 03, 2019

ఫేస్ బుక్ మెసెంజర్ లో డార్క్ మోడ్ ను ఎనేబుల్ చెయ్యటం ఎలా?

How to Enable Dark Mode on Facebook Messenger

దాదాపు అన్ని అప్లికేషన్స్ లలో ఈ మధ్య డార్క్ మోడ్ అనే ఫీచర్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నారు.సాధారణంగా మనము ఒక అప్లికేషన్ ను యూజ్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే కాంతి ద్వారా చాలా ఒత్తిడి కలిగే ప్రమాదం వుంది.కానీ ఈ డార్క్ మోడ్ ద్వారా అప్లికేషన్ UI కి డార్క్ థీమ్ అప్లై అవుతుంది తద్వారా యూజర్స్ తమ కళ్ళకు కలిగే వత్తిడిని కొంతమేరా తగ్గించుకోవచ్చు.ఎట్టకేలకు ఈ డార్క్ మోడ్ ఫేస్ బుక్ మెసెంజర్ కు కూడా వచ్చేసింది.దీనిని మీ ఫేస్ బుక్ మెసెంజర్ లో ఎలా ఆక్టివేట్ చెయ్యాలో ఈ క్రింద చూడవచ్చు.


  • మొదటగా మీరు మీ ఫేస్ బుక్ మెసెంజర్ ను ప్లే స్టోర్ కి వెళ్లి అప్డేట్ చేసుకోండి.
  • తరువాత ఫేస్ బుక్ మెసెంజర్ ను ఓపెన్ చేసి ఏదో ఒక conversation లోకి వెళ్ళండి.
  • ఇప్పుడు మీరు మెసేజ్ ను compose చేసే ప్రదేశం లో వున్న smiley ఫేస్ ను క్లిక్ చేసి  మీ ఫ్రెండ్ కి ఈ క్రింద చూపించబడిన మూన్ emoji ను Send చెయ్యండి.  • వెంటనే మీకు స్క్రీన్ మీద ఒక Animation వస్తుంది.ఆ animation అయిపోయిన తరువాత "You found dark mode " ఒక పాప్ అప్ వస్తుంది.
  • మీరు అక్కడ వున్న TURN ON IN SETTINGS అనే దానిపై టాప్ చెయ్యగానే మీరు సెట్టింగ్స్ వెళతారు.
  • ఇప్పుడు మీరు Dark Mode ఆప్షన్ ను toggle ను జరిపి టర్న్ ఆన్ గాని లేదా టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు.

enable dark mode facebook messenger


మీరు మొదటసారి ప్రయత్నించినప్పుడు ఈ డార్క్ మోడ్ ఆప్షన్ పనిచేయకపోతే మీరు ఒకసారి ఫేస్ బుక్ మెసెంజర్ ను ఫోర్స్ స్టాప్ చేసి మరలా పైన చెప్పిన ప్రాసెస్ ను ఫాలో అవ్వండి.


Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. Saturday, March 2, 2019

March 02, 2019

ఎటువంటి అప్లికేషన్ లేకుండా Images ను PDF గా మార్చటం ఎలా?

Convert Images to PDF without any Application


మనకు ఒక్కొక్కసారి Images ను PDF రూపంలోకి మార్చే అవసరం ఏర్పడుతుంది. అలాంటప్పుడు చాలా మంది ఎక్కువగా ప్లే స్టోర్ కి వెళ్లి వివిధ అప్లికేషన్స్ ను డౌన్లోడ్ చేసుకుంటారు.కానీ ఎటువంటి అప్లికేషన్ తో పని లేకుండా మీరు ఇమేజ్ లను PDF లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు.దీనికి మీరు ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవ్వండి.

మొదటగా మీరు ఈ  https://imagetopdf.com వెబ్సైటు కు వెళ్ళండి.తరువాత అక్కడవున్న UPLOAD FILES అనే దానిపై క్లిక్ చేసి ఫొటోస్ ను సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చెయ్యండి.


convert image to PDFతరువాత COMBINED అనే దానిపై క్లిక్ చేసి మీ PDF ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోండి.ఈ మెథడ్ ద్వారా మీరు సులభంగా ఇమేజ్ ను PDF లోకి మార్చుకోవచ్చు.

convert image to PDFNote: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 


Thursday, February 28, 2019

February 28, 2019

మీరు కాపీ చేసిన టెక్స్ట్ ఫోన్ ను రీబూట్ చేయగానే డిలీట్ అయిపోతుందా? అయితే ఇలా చెయ్యండి!

Best Clipboard Application For Android


మనము ఆండ్రాయిడ్ ఫోన్ లో ఒక్కొక్కసారి ఇంటర్నెట్ నుండి లేదా వేరే ప్రదేశం నుంచి ఒక టెక్స్ట్ ను కాపీ చేసుకుని దానిని ఇంకొక ప్రదేశం లో పేస్ట్ చేసుకుంటూ ఉంటాము.కానీ మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు ఒకేసారి కేవలం ఒక టెక్స్ట్ ను మాత్రమే కాపీ చేసుకుని పేస్ట్ చెయ్యాల్సి ఉంటుంది.

ఇలా కాకుండా మీరు కాపీ చేసిన ప్రతి టెక్స్ట్ ఒక చోట స్టోర్ అయ్యి దానిని మీకు నచ్చినప్పుడు, నచ్చిన చోట పేస్ట్ చేసుకోగలిగితే..! మరియు మీరు కాపీ చేసిన టెక్స్ట్ మీరు ఫోన్ ను రీబూట్ చేసినా కూడా డెలీట్ అవ్వకపోతే..! చాలా ఉపయోగకరంగా ఉంటుంది కదా..!?

కానీ ఇది ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ప్లే స్టోర్ లో లభించే ఈ Clipboard Manager, Notes, use Clipto Pro అనే అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోండి.దీని ద్వారా మీరు కాపీ చేసిన ప్రతి టెక్స్ట్ ఈ అప్లికేషన్ లో  స్టోర్ అవుతుంది.తద్వారా మీరు మీ ఫోన్ ను రీబూట్ చేసినా కూడా మీరు కాపీ చేసిన టెక్స్ట్ అనేది డెలీట్ అవ్వదు.అలానే మీరు వివిధ టెక్స్ట్ లను కాపీ చేసుకుని భవిష్యత్తు లో ఉపయోగించుకోవచ్చు.

మీరు ఈ అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసాక అప్లికేషన్ ఫై భాగం లో ఒక toggle ఉంటుంది.మీరు దానిని ఆన్ చెయ్యండి.తరువాత మీ ఆండ్రాయిడ్ లో మీరు కాపీ చేసిన ప్రతి టెక్స్ట్ ఈ అప్లికేషన్ లోకి వస్తుంది.మీరు మీకు కావలసినప్పుడు ఈ అప్లికేషన్ లో వున్న టెక్స్ట్ ను టాప్ చెయ్యడం ద్వారా టెక్స్ట్ ను కాపీ  చేసుకోవచ్చు.మీరు ఈ అప్లికేషన్ లో వున్న టెక్స్ట్ పైన లాంగ్ ప్రెస్ చేసి Delete సింబల్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ను డిలీట్ చేసుకోవచ్చు.దీనిలో ఇంకా చాలా ఉపయోగకరమయిన ఆప్షన్స్  ఎన్నో వున్నాయి.


Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 

Tuesday, February 12, 2019

February 12, 2019

కంప్యూటర్ లో వెబ్ పేజీ లను ఆటోమేటిక్ గా రిఫ్రెష్ చెయ్యటం ఎలా?

How to Refresh Webpages Automatically On PC
మనము ఒక్కోసారి బ్రౌజర్ లో వెబ్ పేజీ ని పదే పదే  రీఫ్రెష్ చెయ్యాల్సి వస్తుంది.అలాంటప్పుడు మనము ప్రతిసారి మౌస్ తో రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేస్తుంటాము లేదా కంప్యూటర్ లో F5 Function కీ ని ఉపయోగిస్తాము.ఇలా చెయ్యటం వల్ల మనము విసుకు రావొచ్చు.

ఇలా కాకుండా మీరు మీ వెబ్ పేజీ ను ఆటోమేటిక్ గా రీఫ్రెష్ చేయటం వల్ల మీ టైం కొంచం సేవ్ అవుతుంది మరియు మీకు విసుగు అనేది రాదు.మీరు ఎటువంటి బటన్ ని క్లిక్ చెయ్యకుండా వెబ్ పేజీ ని ఆటోమేటిక్ గా రిఫ్రెష్ చెయ్యటానికి ఒక మంచి ఎక్స్టెన్షన్ వుంది.అదే Auto Refresh Plus.మీరు దీనిని మీ గూగుల్ క్రోమ్ లో యాడ్ చేసుకుని టైం ని సెట్ చేసుకోవడం వల్ల మీ వెబ్ పేజీ ఆటోమేటిక్ గా మీరు సెట్ చేసిన టైం కి కరెక్ట్ గా రిఫ్రెష్ అవుతుంది.

ఉదాహరణకు మీరు 10 sec అని సెట్ చేస్తే వెబ్ పేజీ 10 sec కి ఒకసారి ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అవుతుంది.దీనిలో ఇంకా మరెన్నో ఫీచర్స్ కూడా వున్నాయి మీరు దీనిని ఇక్కడ నుండి మీ గూగుల్ క్రోమ్ కి యాడ్ చేసుకోవచ్చు.

దీనిని మీరు మీ గూగుల్ క్రోమ్ లో యాడ్  చేసుకున్న తరువాత మీ బ్రౌసర్ టాప్ లో సెర్చ్ బాక్స్ కు కుడి ప్రక్కన ఒక ఐకాన్ ప్రత్యక్షమవుతుంది.మీరు దానిపై మౌస్ తో క్లిక్ చేసి మీకు కావలసిన టైం ను సెట్ చేసుకుని Start మీద క్లిక్ చెయ్యగానే మీ వెబ్ పేజీ ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అవుతుంది.మరలా Stop పైన క్లిక్ చెయ్యగానే రిఫ్రెష్ అవ్వటం ఆగిపోతుంది.

Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 

Thursday, February 7, 2019

February 07, 2019

ఫేస్ బుక్ లో పొరపాటున పంపిన మెసేజ్ ను డిలీట్ చెయ్యాలి అని అనుకుంటున్నారా? అయితే ఇలా చెయ్యండి!

How to Unsend Messages On Facebook

మనము ఒక్కొక్కసారి పొరపాటున మెసేజ్ ను తప్పుగా పంపుతాము లేదా మనము పంపాలి అనుకున్న వారికి కాకుండా వేరే వారికి మెసేజ్ పంపే సందర్భాలు లేకపోలేవు.కాని ఒకసారి మనము మెసేజ్ పంపిన తరువాత దాన్ని డిలీట్ చేయ్యటం అసాధ్యం మరియు డిలీట్ చేసినా  కూడా అది మన వరకే డెలీట్ అవుతుంది.ఈ మధ్యనే వాట్సాప్ లో మనము కొన్ని నిమిషాల వ్యవధిలో మన మెసేజ్ ను పూర్తిగా డిలీట్ చేసుకునే ఆప్షన్ వచ్చింది.కాని ఫేస్ బుక్ లో ఇటువంటి సదుపాయం ఇప్పటి వరకు లేదు.కాని ,క్రొత్తగా ఫేస్ బుక్ కూడా ఈ సదుపాయాన్ని తెచ్చింది.దీని ద్వారా ఫేస్ బుక్ లో మీరు పంపిన మెసేజ్ ను 10 నిమిషాల వ్యవధిలో పూర్తిగా డిలీట్ చేసుకునే అవకాశం వుంది.ఇది ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.


  • మొదటగా మీరు ప్లే స్టోర్ కి వెళ్లి Facebook మెసెంజర్ ను లేటెస్ట్ వెర్షన్ కు అప్డేట్ చేసుకోండి.
  • తరువాత మీరు ఎప్పుడు అయినా పొరపాటున మెసేజ్ ను తప్పుగా పంపితే వెంటనే మీరు పంపిన మెసేజ్ పైన ఫింగర్ తో లాంగ్ ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు Remove అనే ఆప్షన్ మీద ప్రెస్ చెయ్యండి.తరువాత Remove for everyone అనే ఆప్షన్ మీద ప్రెస్ చెయ్యండి.ఇప్పుడు మరలా REMOVE అనే దాని పైన క్లిక్ చెయ్యగానే మీరు పంపిన మెసేజ్ పూర్తిగా డిలీట్ అయిపోతుంది.

How to Unsend Messages On Facebook
Step:1
How to Unsend Messages On Facebook
Step:3
How to Unsend Messages On Facebook
Step:2మీరు ఒక వేల కంప్యూటర్ లో ఫేస్ బుక్ వాడుతుంటే మౌస్ కర్సర్ ను మీరు పంపిన మెసేజ్ మీదకు తీసుకురండి.తరువాత అక్కడ కనిపించే three dot symbol పై క్లిక్ చేసి Remove అనే దానిపై క్లిక్ చెయ్యండి.ఇప్పుడు మీకు ఒక pop up box వస్తుంది.దానిలో Remove for everyone అని సెలెక్ట్ చేసి Remove అనే దానిపై క్లిక్ చెయ్యండి.


How to Unsend Messages On Facebook
Facebook Unsend On Desktop UI

ఈ విధం గా మీరు పంపిన మెసేజ్ ను 10 నిమిషాల లోపు డెలీట్ చేసుకునే సదుపాయాన్ని ఫేస్ బుక్ కల్పించింది.దీని ద్వారా వినియోగదారులు చాలా అపార్దాల నుండి తప్పించుకోవచ్చు.


Also Read: మిమ్మల్ని కంపెనీ కాల్స్ బాగా ఇబ్బంది పెడుతున్నాయా?అయితే ఇలా చేయండి..!


Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 


Tuesday, February 5, 2019

February 05, 2019

మిమ్మల్ని కంపెనీ కాల్స్ బాగా ఇబ్బంది పెడుతున్నాయా?అయితే ఇలా చేయండి..!

How to Activate and Deactivate DND on Airtel | Vodafone | Jio and etc.


How to Activate DND on any Network ?


మీరు మీ ఫోన్ లో ఎయిర్టెల్ SIM లేదా మరే ఇతర SIM వాడుతున్నా కూడా మీకు ఎక్కువగా కంపెనీ నుంచి కాల్స్ రావడం గమనించే వుంటారు. ఈ కాల్స్ లేదా SMS లలో ఆఫర్స్ గురించి, వివిధ పాటలను కాలర్ ట్యూన్ గా పెట్టుకోమని,ఇంకా ఎన్నో రకాల advertisements ఇబ్బంది పెడుతూ ఉంటాయి.మీరు బిజీ గా వున్నప్పుడు ఈ ఫోన్ కాల్స్ లేదా SMS లు ఇంకా ఇబ్బందిని కలిగిస్తాయి.కాబట్టి ఈ ఫోన్ కాల్స్ ను ,SMS లను స్టాప్ చేయటం తప్పనిసరి.కానీ ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా? దీనికి DND(Do Not Disturb) అనే ఒక సర్వీస్ వుంది.మీరు దీనిని ఆక్టివేట్ చేశారంటే మీ SIM ప్రొవైడర్ నుంచి ఇలాంటి  మెసేజ్ లు అలాగే ఫోన్ కాల్స్ రావు.దీనిని ఎలా ఆక్టివేట్ చెయ్యాలో ఈ క్రింద చూడండి.


మొదటగా మీరు మీ ఫోన్ లో SMS అప్లికేషన్ ను ఓపెన్ చేసి START 0 అని టైపు చేసి 1909 కి మీరు ఏ నెంబర్ మీద అయితే కమర్షియల్ కాల్స్ ను స్టాప్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ నెంబర్ నుంచి SMS పంపండి.అంతే మీ నెంబర్ DND సర్వీస్ లో రిజిస్టర్ అవుతుంది మరియు మీకు ఇంక కంపెనీ నుంచి ఎటువంటి spam కాల్స్ రావు.కాని ఇది పూర్తిగా ఆక్టివేట్ అవడానికి కొంత సమయం పడుతుంది.

ఒక వేల మీ మనసు మారి మీకు కంపెనీ నుంచి కమెర్షియల్ కాల్స్ మరియూ ఇతరత్రా కాల్స్ యిదివరకు మాదిరిగా కావాలి అని అనుకుంటే మరలా SMS అప్లికేషన్ ను ఓపెన్ చేసి STOP 0 అని టైపు చేసి 1909 కి SMS పంపండి.


Also Read: వాట్సాప్ లో గ్రూప్ కాల్స్ చేసుకోవడం ఎలా? వాట్సాప్ లో క్రొత్త ఫీచర్..!

Also Read:వాట్సాప్ మెసేజ్ ను ఒకేసారి 5 కంటే ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయటం ఎలా?


Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 

Saturday, February 2, 2019

February 02, 2019

వాల్ పేపర్ ప్రియులకు అద్భుతమయిన ఆండ్రాయిడ్ అప్లికేషన్...

ఆండ్రాయిడ్ ఫోన్ లో చాలా మంది ప్రతిసారి వాల్ పేపర్ ను చేంజ్ చేస్తూ వుంటారు.అవును.. వాల్ పేపర్ వల్ల మన ఫోన్ యొక్క లుక్ మారిపోతుంది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు.! ఇప్పుడు ఫోన్స్ ఎక్కువ రిసొల్యూషన్ తో రావడం వల్ల తక్కువ క్లారిటీ కలిగిన ఫొటోస్ ను వాల్ పేపర్ గా సెట్ చెయ్యటం వల్ల వాల్ పేపర్ బ్లర్ అవుతుంది.

దీని కొరకు గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు మనకు ఎక్కువగా HD పిక్చర్స్ రావడం కష్టం.మరి మనకు HD క్లారిటీ కలిగిన వాల్ పేపర్లు ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటున్నారా? అయితే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో లభించే Wallpapers and Backgrounds అప్లికేషన్ ను ఒక సారి ట్రై చేసి చూడండి.దీనిలో ఎన్నో రకాల వాల్ పేపర్స్ అదీ HD క్లారిటీ తో లభిస్తున్నాయి.


మీరు మీకు నచ్చిన వాల్ పేపర్ ను మీకు నచ్చిన క్లారిటీ తో డౌన్లోడ్  చేసుకుని డైరెక్ట్ గా మీ ఫోన్ కు వాల్ పేపర్ గా అప్లై చేసుకోవచ్చు.


అంతే కాకుండా మీరు వాల్ పేపర్ కు రియల్ టైం లో కొన్ని రకాల ఫోటో ఎఫెక్ట్స్ ను కూడా అప్లై చేసుకోవచ్చు.ప్లే స్టోర్ లో వున్న అన్ని అప్లికేషన్స్ లో ఈ అప్లికేషన్ ను ది బెస్ట్ గా చెప్పుకోవచ్చు...!


Also Read: వాట్సాప్ లో గ్రూప్ కాల్స్ చేసుకోవడం ఎలా? వాట్సాప్ లో క్రొత్త ఫీచర్..!


Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.