Translate

18, జనవరి 2020, శనివారం

జనవరి 18, 2020

జనరల్ నాలెడ్జి- 33

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)
జనరల్ నాలెడ్జి 

ప్రశ్న. ఇరాక్ యొక్క కరెన్సీ.

జ. దీనార్( ఇరాకీ దీనార్)

ప్రశ్న. ఇరాన్ యొక్క కరెన్సీ.

జ. రియాల్ (ఇరానియన్ రియాల్)

ప్రశ్న. ఏ బ్యాంకు యిదివరకు ఇంపీరియల్ బ్యాంక్ అఫ్ ఇండియా అని పిలవబడినది.

జ. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా

ప్రశ్న. పసిఫిక్ మహాసముద్రం ను అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతున్న కాలువ ఏది?

జ. పనామా కాలువకంప్యూటర్ నాలెడ్జి

ప్రశ్న. బ్లూటూత్ ఏ ఏరియా నెట్వర్క్ కు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

జ.  పర్సనల్ ఏరియా నెట్వర్క్

ప్రశ్న. కంప్యూటర్ పరిభాషలో MSD అనగా.

జ.  Most Significant Digit 

ప్రశ్న. C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ను డెవలప్ చేసింది లేదా సృష్టికర్త ఎవరు?

జ.  Bjarne Stroustrup

జనరల్ నాలెడ్జి- 32 లోని over to you ప్రశ్న మరియు జవాబు.

ప్రశ్న. NABARD ను విస్తరించుము.

జ. National Bank for Agriculture and Rural Development

Over to you 

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.

నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -32

Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

16, జనవరి 2020, గురువారం

జనవరి 16, 2020

ఇంస్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్ త్వరలో వెబ్ వెర్షన్ కి కూడా రానున్నది! వివరాలు ఇవి..

Instagram Starts Expanding DM(Direct Messaging) Feature To It's Web Versionఇంస్టాగ్రామ్ అప్లికేషన్ గురించి తెలియని వారు చాలా తక్కువ మంది వుంటారు.రోజూ ఎంతో మంది ఈ అప్లికేషన్ ద్వారా తమ ఫొటోస్ ను లేదా వీడియోస్ ను షేర్ చేసుకుంటారు.

అలానే ఈ ఇంస్టాగ్రామ్ కు వెబ్ వెర్షన్ కూడా వుంది.దీని ద్వారా మీరు బ్రౌజర్ ద్వారా ఇంస్టాగ్రామ్ లోకి లాగిన్ అయ్యి కార్యకలాపాలను కొనసాగించవచ్చు.

కానీ, ఈ ఇంస్టాగ్రామ్ వెబ్ వెర్షన్ లో అప్లికేషన్ తో పోల్చుకుంటే చాలా తక్కువ ఫీచర్స్ ఉంటాయి.వాటిలో చాలా ఇబ్బందికి గురిచేసే అంశం ఏమిటంటే, ఈ ఇంస్టాగ్రామ్ వెబ్ వెర్షన్ లో DM (Direct Messaging) ఫీచర్ లేదు.

కానీ ఈ సమస్యను పరిష్కరిస్తూ ఇంస్టాగ్రామ్ త్వరలో ఈ DM ఫీచర్ ను వెబ్ వెర్షన్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయనున్నది.ఈ ఫీచర్ ఆల్రెడీ టెస్టింగ్ స్టేజి లో వుంది.మరియు చాలా కొద్దిమంది ఈ ఫీచర్ ను పొందినట్లు సమాచారం.ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ స్టేజి లో వుంది కాబట్టి ఇది అందరికీ రావటానికి కొంత సమయం పడుతుంది.
ఇంస్టాగ్రామ్ అప్లికేషన్ లో మాత్రమే వున్న ఈ ఫీచర్ వెబ్ వెర్షన్ కి కూడా వచ్చినట్లు అయితే మీరు ఇంకా తేలికగా బ్రౌజర్ నుంచే DM సింబల్ ను క్లిక్ చేసి లేదా యూజర్ యొక్క ప్రొఫైల్ లోకి వెళ్లి Message అనే బటన్ పై క్లిక్ చేసి చాట్ చేసుకోవచ్చు.అప్లికేషన్ లో మాదిరిగానే మీరు ఫొటోస్ మరియు వీడియోస్ ను కూడా పంపుకోవచ్చు.

Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

14, జనవరి 2020, మంగళవారం

జనవరి 14, 2020

జనరల్ నాలెడ్జి- 32

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)
జనరల్ నాలెడ్జి 

ప్రశ్న. అశోకుడు ఏ రాజవంశానికి చెందినవాడు.

జ. మౌర్య వంశం

ప్రశ్న. మహాబలిపురం ఎవరిచేత కట్టబడింది.

జ. పల్లవులు

ప్రశ్న. FASTag సిస్టం ఇండియాలోకి ఎప్పుడు పూర్తిగా అమలులోకి వచ్చింది. 

జ. 15 డిసెంబర్ 2019

ప్రశ్న. సారనాధ్ ఏ రాష్ట్రం లో వుంది.

జ. ఉత్తర ప్రదేశ్కంప్యూటర్ నాలెడ్జి

ప్రశ్న. MS Excel లో క్రియేట్ చేసిన ఫైల్ డిఫాల్ట్ గా ఏ ఎక్స్టెన్షన్ తో సేవ్ అవుతుంది.

జ.  .xls

ప్రశ్న. కంప్యూటర్ నెట్వర్క్స్ పరంగా OSI మోడల్ లో ఏడు లేయర్లు ఉండగా, TCP/IP మోడల్ లో ఎన్ని లేయర్లు ఉంటాయి.

జ.  నాలుగు

ప్రశ్న. LAN, MAN, WAN లలో ఇంటర్నెట్ ఏ ఏరియా నెట్వర్క్ క్రిందకు వస్తుంది.

జ.  WAN (Wide Area Network)

జనరల్ నాలెడ్జి- 31 లోని over to you ప్రశ్న మరియు జవాబు.

ప్రశ్న. గౌతమ బుద్ధుడు ఏ వంశానికి చెందినవాడు?

జ. శాక్య

Over to you 

NABARD ను విస్తరించుము.

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.

నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -31

Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

13, జనవరి 2020, సోమవారం

జనవరి 13, 2020

విండోస్ 10 Photos అప్లికేషన్ లో Facial Recognition ను డిసేబుల్ చెయ్యటం ఎలా?

How To Disable Facial Recognition In Windows 10 'Photos' Application | in Telugu

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం లో మన ఫొటోస్ ను డిఫాల్ట్ గా 'Photos' అప్లికేషన్ లో చూస్తాము.దీనిలో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ తో పోల్చుకుంటే ఎక్కువ ఎడిటింగ్ ఫీచర్స్ లేకుండా సింపుల్ గా ఉంటుంది.

ఇది ఇలాగు వుండగా, ఈ అప్లికేషన్ Facial Recognition టెక్నాలజీ ను ఉపయోగిస్తుంది.దీని గురించి చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ వున్నారు.

మీరు దీనిలో వున్న Facial Recognition అనే ఆప్షన్ ను ఎనేబుల్ చేసినట్లు అయితే ఈ అప్లికేషన్ మెషిన్ లెర్నింగ్ ను వుపయోగించి మీ ఫొటోస్ మరియు వీడియో లలోని ముఖాలను గుర్తించి, వీటితో సరితూగిన మిగతా ఫోటోలను మరియు వీడియోలను ఒక గ్రూప్ గా చేస్తుంది.

ఇది చాలా ఉపయోగకరమయినది అనే చెప్పాలి.ఇక ఈ ప్రాసెస్ మీ PC లోనే జరుగుతుంది. కాబట్టి ప్రైవసీ గురించి అంతగా చింతించనవసరం లేదు.

కానీ ఈ ఫీచర్ అసలు వద్దు అని అనుకునే వారికి ఈ ఆర్టికల్ లో నేను ఈ ఫీచర్ ను ఎలా ఆఫ్ చెయ్యాలో  చెప్పడం జరిగింది.ఈ ఫీచర్ ను మీరు డిసేబుల్ చెయ్యటం వల్ల ఈ అప్లికేషన్ మీ ఫొటోస్ లేదా వీడియోలలోని ముఖాలను ప్రాసెస్ చెయ్యదు.

  • ముందుగా దీనికోసం మీరు మీ విండోస్ 10 PC లో సెర్చ్ బార్ ను వుపయోగించి కానీ,లేదా విండోస్ బటన్ పై క్లిక్ చేసి కానీ Photos అప్లికేషన్ లోకి వెళ్ళండి.
How To Disable Facial Recognition In Windows 10 'Photos' Application | in Telugu

  • తరువాత అప్లికేషన్ పైభాగాన వున్న త్రీ డాట్ సింబల్ ను క్లిక్ చేసి Settings అనే దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ కు వెళ్ళండి.
How To Disable Facial Recognition In Windows 10 'Photos' Application | in Telugu

How To Disable Facial Recognition In Windows 10 'Photos' Application | in Telugu

  • ఇప్పుడు మౌస్ తో స్క్రోల్ చేసి Viewing and Editing అనే సెక్షన్ లో వున్న People అనే ఆప్షన్ ను toggle ను జరపడం ద్వారా ఆఫ్ చెయ్యండి.
How To Disable Facial Recognition In Windows 10 'Photos' Application | in Telugu

ఇలా మీరు విండోస్ 10 లోని Photos అప్లికేషన్ లో Facial Recognition ను డిసేబుల్ చేసుకోవచ్చు.

Read Also: మీ మొబైల్ కు సంభందించిన అన్ని టెక్నికల్ వివరాలను ఇలా తెలుసుకోండి..!

Read Also: గూగుల్ క్యాలండర్ లో డార్క్ మోడ్ ను ఎనేబుల్ చేసుకోవటం ఎలా?

Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

12, జనవరి 2020, ఆదివారం

జనవరి 12, 2020

జనరల్ నాలెడ్జి- 31

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)
జనరల్ నాలెడ్జి 

ప్రశ్న. జాతీయ యువజన దినోత్సవం ను భారత దేశంలో ఎప్పుడు జరుపుకుంటారు?

జ. జనవరి 12 

ప్రశ్న. అష్టాధ్యాయి ను రచించినది.

జ. పాణిని

ప్రశ్న. గోత్రము అనే పదం మొదటిగా ఏ వేదంలో ప్రస్తావించబడింది.

జ. ఋగ్వేదం

ప్రశ్న. నంద వంశ స్థాపకుడు.

జ. మహాపద్మనందుడు కంప్యూటర్ నాలెడ్జి

ప్రశ్న. OSI (Open Systems Interconnection) మోడల్ లో మొత్తం ఎన్ని లేయర్లు ఉంటాయి.

జ.  ఏడు

ప్రశ్న. కంప్యూటర్ పరిభాషలో Primary Cache ను ఈ విధంగా కూడా అంటారు?

జ. L1 Cache (లెవెల్-1 Cache)

ప్రశ్న. కీబోర్డ్ లో మొట్టమొదటి వరుసలో పొందుపరచబడి వున్న కీ లను ఏమంటారు.

జ.  ఫంక్షన్ కీస్

జనరల్ నాలెడ్జి- 30 లోని over to you ప్రశ్న మరియు జవాబు.

ప్రశ్న. హర్ష చరిత్ర ను రచించినది ఎవరు?

జ. బాణభట్టుడు (బాణుడు)

Over to you 

గౌతమ బుద్ధుడు ఏ వంశానికి చెందినవాడు?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.

నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -30

Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.