ఆండ్రాయిడ్ లో మనము రోజూ చాలా అప్లికేషన్స్ ను యూజ్ చేస్తాము.కాని ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే మనకి కాలిక్యులేటర్ కావాలి అంటే కాలిక్యులేటర్ యాప్ ని, స్టాప్ వాచ్ కావాలి అంటే స్టాప్ వాచ్ యాప్ ని ఓపెన్ చేయాలి.ఒకవేళ మన ఫోన్ లో ఎక్కువ అప్లికేషన్స్ ఉంటే మనకు కావలసిన యాప్ ని వెతకటం చాలా కష్టం.ఇది అంతా కాకుండా మనం తరచూ ఉపయోగించే టూల్స్ మొత్తం ఒకే అప్లికేషన్ లో ఉంటే ఎలా ఉంటుంది? అవును ఇలా ఉండటం వల్ల మనము ఒకే యాప్ లో మనకు కావలసిన టూల్ ని సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు.మనకు టైం కూడా సేవ్ అవుతుంది.దీనికి ఆండ్రాయిడ్ స్టోర్ లో ఒక మంచి అప్లికేషన్ వుంది.దీనిని ఉపయోగించి మనం డైలీ యూజ్ చేసే యాప్స్ ను ఒకే చోట ఉపయోగించుకోవచ్చు.ఈ అప్లికేషన్ పేరే Smart Kit 360. దీనిలో మనము డైలీ యూజ్ చేసే అప్లికేషన్స్ చాలా వున్నాయి.వాటిలో నోట్ పాడ్ ,డిక్షనరీ,రికార్డర్,స్టాప్ వాచ్ మొదలయినవి.ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీరు చాలా టూల్స్ ను ఒకేచోట యాక్సిస్  చెయ్యొచ్చు.ఈ అప్లికేషన్ ని వుపయోగించి మీరు ఆన్లైన్ షాపింగ్ సైట్స్ అయిన అమెజాన్,ఫ్లిప్ కార్ట్ వంటి తదితర వెబ్సైట్ లను కూడా యాక్సిస్ చెయ్యొచ్చు. దీని వల్ల మీకు చాలా ప్రయోజనం ఉంటుంది.
ఈ అప్లికేషన్ ను ఉపయోగించటం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది.అలానే  మీ ఫోన్ లో స్టోరేజి తగ్గే అవకాశం కూడా వుంది.మీకు కావాలంటే ఈ అప్లికేషన్ ను ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి.


Post a Comment

సరిక్రొత్తది పాతది