Latest

Friday, November 16, 2018

గూగుల్ యొక్క క్రొత్త వెబ్ అప్లికేషన్: మీ ఫొటోస్ ల యొక్క క్వాలిటీ తగ్గకుండా సైజును తగ్గించుకోండి..!

photo edited by squoosh

మీరు మీ ఫోటోల యొక్క క్వాలిటీ తగ్గకుండా వాటి సైజు ను తగ్గేలా చెయ్యాలి అని అనుకుంటున్నారా ? అయితే మీకు గూగుల్ క్రొత్తగా తెచ్చిన squoosh అనే వెబ్ అప్లికేషన్  మీకు చాలా ఉపయోగపడుతుంది.గూగుల్ క్రొత్త గా తీసుకువచ్చిన  ఈ వెబ్ అప్లికేషన్ తో  ఫోటో యొక్క క్వాలిటీ తగ్గకుండా సైజు ను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

దీని ద్వారా మీరు ఇమేజ్ యొక్క  డైమెన్షన్స్ కూడా మార్చుకోవచ్చు.ఇది చాలా రకాల ఇమేజ్ ఫార్మట్స్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ వెబ్సైటు లేదా వెబ్ అప్లికేషన్ ఒకసారి మన ఫోన్ లోకి లోడ్ అయితే దీనిని ఆఫ్ లైన్ లో కూడా వాడుకోవచ్చు.మీరు సింపుల్ గా వెబ్సైటు లోడ్ అవగానే select an image అనే ఆప్షన్ ను ఎంచుకుని లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా ఇమేజ్ ని అప్లోడ్ చేసి పలు రకాల కంప్రెషన్స్ ను అప్లై చేసి ఇమేజ్ సైజు ను తగ్గించుకోవచ్చు.మీకు స్క్రీన్ మీద కనపడే స్పైడర్ బార్ ను పైకి క్రిందకు లేదా అటూ ఇటూ కదిలించటం ద్వారా మీ ఒరిజినల్ ఇమేజ్ మరియు కంప్రెస్ అయిన ఇమేజ్ ల మధ్య తేడాను గమనించవచ్చు.మీరు మీ ఇమేజ్ ను కంప్రెస్ చేసిన  తరువాత డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.మీరు ఇక్కడ నుండి ఈ Web Appliacation ను ట్రై చెయ్యొచ్చు.

No comments:

Post a Comment