ఆండ్రాయిడ్ లో మనము సాధారణం గా గూగుల్ ప్లే స్టోర్ నుండి అప్లికేషన్స్ ను డౌన్లోడ్  చేసుకుంటాము.కానీ ఒక్కొక్కసారి మనకు కావలసిన అప్లికేషన్ ను కంప్యూటర్ నుండి  డౌన్లోడ్ చేసుకోవలసి వస్తుంది.అలాంటప్పుడు మనకు కంప్యూటర్ లో ఆండ్రాయిడ్ స్టోర్ ఓపెన్ అయినా కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉండదు.కాబట్టి అప్లికేషన్స్ ను బయట థర్డ్ పార్టీ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవలసి వస్తుంది.ఇది అంత మంచిది కాదు.


కాబట్టి ఈ ఆర్టికల్ లో నేను కంప్యూటర్ లో ప్లే స్టోర్ నుండి మనకు కావలసిన అప్లికేషన్ ను ఎలా  డౌన్లోడ్ చేసుకోవచ్చో చెప్తాను.మొదటగా మీరు ప్లే స్టోర్ ను కంప్యూటర్ లో  ఓపెన్ చేసి  మీకు కావలసిన అప్లికేషన్ ను సెర్చ్ చేసి దాని అడ్రస్ ను కాపీ చెయ్యండి.తరువాత https://apps.evozi.com/apk-downloader లోకి వెళ్ళండి.తరువాత ఆ పేజీ లో  కనపడుతున్న బాక్స్ లో మీరు ఇందాక కాపీ చేసిన లింక్ ను పేస్ట్ చెయ్యండి.తరువాత Generate download link మీద క్లిక్ చెయ్యండి.కొంచం సేపటి తరువాత  Generate download link క్రింద ఒక గ్రీన్ బాక్స్ జనరేట్ అవుతుంది మీరు దానిని క్లిక్ చేసి మీ అప్లికేషన్ ను మీ కంప్యూటర్ లోకి సేవ్ చేసుకోవచ్చు.


మీరు పైన చెప్పిన వెబ్సైట్ ను బుక్ మార్క్ చేసుకోండి.దీని వల్ల మీకు ఎప్పుడైనా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ను ప్లే స్టోర్ నుండి కంప్యూటర్ లోకి డౌన్లోడ్ చేసుకోవాలని అనిపిస్తే  ఈజీ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.Read Also: ఈ ఒక్క అప్లికేషన్ వంద అప్లికేషన్స్ తో సమానం..!
Post a Comment

సరిక్రొత్తది పాతది