యూట్యూబ్ నుంచి మనకు నచ్చిన  వీడియో ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే వీడియో క్రింద వున్న డౌన్లోడ్ సింబల్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటాము.మనకు కొన్ని వీడియో కు డౌన్లోడ్ సింబల్ ఉండదు అలాంటప్పుడు  మనము ఆ వీడియో లను ఎలా డౌన్లోడ్ చేయాలి అని మనము ఆల్రెడీ ఈ  బ్లాగ్ లో రాయటం జరిగింది మీరు ఈ లింక్ ద్వారా దీనిని చదవవచ్చు.

మనము ఫేస్ బుక్ లో కూడా మనకు నచ్చిన వీడియోస్ ను డౌన్లోడ్ చేసుకోవటానికి ఎటువంటి ఆప్షన్  లేదు.కానీ నేను ఈ పోస్ట్ లో ఫేస్ బుక్ లోని వీడియోస్ ను మీరు ఎటువంటి అప్లికేషన్స్ ను ఉపయోగించకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో  చెప్తాను.

ఆండ్రాయిడ్

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ లో ఫేస్ బుక్ అప్లికేషన్ ను ఉపయోగిస్తున్నట్లయితే మీరు మీకు నచ్చిన వీడియో దగ్గరకు వెళ్లి వీడియో పైభాగం లో వున్న three dot symbol ని క్లిక్ చేసి copy link మీద క్లిక్ చేయండి.తరువాత fbdown.net వెళ్లి మీరు కాపీ చేసిన లింక్ ను ఆ పేజీ లో కనిపించే బాక్స్ లో పేస్ట్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి.తరువాత మిమ్మల్ని ఏ క్వాలిటీ లో వీడియో కావాలి అని అడుగుతుంది మీరు మీకు కావలసిన వీడియో క్వాలిటీ ని ఎంచుకోండి.వెంటనే మీ వీడియో ప్లే అవుతుంది. మీరు ప్లే అవుతున్న వీడియో కి క్రింద కుడి ప్రక్క వున్న three dot symbol ని క్లిక్ చేసి download మీద క్లిక్ చేయండి.అంతే మీ వీడియో డొన్లోడ్ అవుతుంది.


కంప్యూటర్ 

మీరు కంప్యూటర్ లో ఫేస్ బుక్ వాడుతుంటే మీకు కావలసిన వీడియో మీద రైట్ క్లిక్ ఇవ్వండి.తరువాత show video url మీద క్లిక్ చేసి URL ను  కాపీ చేయండి.తరువాత పైన చెప్పినట్టు గానే fbdown.net కి వెళ్లి మీరు కాపీ చేసిన URL ను ఆ వెబ్సైటు లో కనపడుతున్న బాక్స్ లో పేస్ట్ చేయండి.తరువాత మీకు కావలసిన క్వాలిటీ ను ఎంచుకోండి.వెంటనే మీ వీడియో ప్లే అవుతుంది.మీరు ప్లే అవుతున్న వీడియో క్రింద కుడి ప్రక్క వున్న three dot symbol ని క్లిక్ చేసి download మీద క్లిక్ చేయండి చేసి వీడియో ను మీ కంప్యూటర్ లో కి సేవ్ చేసుకోవచ్చు.


Also Read: ఇంస్టాగ్రామ్ ఫొటోస్ మరియు వీడియోస్ ను డౌన్లోడ్ చెయ్యటం ఎలా?

Post a Comment

సరిక్రొత్తది పాతది