Latest

"Genius is one percent inspiration, ninety-nine percent perspiration"--Thomas Edison

Thursday, November 8, 2018

ఇంస్టాగ్రామ్ ఫొటోస్ మరియు వీడియోస్ ను డౌన్లోడ్ చెయ్యటం ఎలా?

instagram image
Licence:CreativeCommon


ఈ మధ్య కాలం లో ఫేస్బుక్ తో పాటు ఇంస్టాగ్రామ్ కూడా చాలా ఫేమస్ అవుతుంది .చాలా మంది తమ ఫోటోలను మరియు వీడియోస్ లను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు.కానీ ఇంస్టాగ్రామ్ లో కొన్ని సెక్యూరిటీ నిబంధలను వల్ల మనము ఫొటోస్ లేదా వీడియోస్ లను డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోలేము.కానీ ఇంస్టాగ్రామ్ వీడియోస్,ఫొటోస్ డౌన్లోడ్ చేసుకుంటానికి ఎన్నో రకాల ఆండ్రాయిడ్ అప్లికేషన్స్  వున్నాయి.కానీ ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ ని ఫాలో అవ్వటం వల్ల మీరు ఎటువంటి అప్లికేషన్స్ ఉపయోగించకుండా  ఇంస్టాగ్రామ్ పోస్ట్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.


మొదటగా మీరు మీ ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసి మీకు కావలసిన ఫోటో లేదా వీడియో ఫై భాగం లో వున్న three dot symbol ని క్లిక్ చేయండి (ఒక వేల మీరు కంప్యూటర్ యూస్ చేస్తున్నట్లయితే three dot symbol మీకు పోస్ట్  క్రింది భాగంలో కుడి చేతి వైపున కనిపిస్తుంది). క్లిక్ చేసిన తరువాత  Copy link అనే ఆప్షన్ ని నొక్కండి.తరువాత ఈ వెబ్సైటు https://downloadgram.com  లో కి వెళ్లి మీరు కాపీ చేసిన లింక్ ను ఆ పేజీ లో కనపడుతున్న బాక్స్ లో పేస్ట్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చెయ్యండి.మీరు వీడియో లింక్ ను కాపీ చేస్తే  డౌన్లోడ్ వీడియో లేదా మీరు ఫోటో లింక్ ను కాపీ చేస్తే డౌన్లోడ్ ఫోటో అని వస్తుంది.మీరు దాని మీద క్లిక్ చేయండి.అంతే మీ యొక్క వీడియో లేదా ఫోటో డౌన్లోడ్ అవుతుంది.


Also Read: వాట్సాప్ లో 16MB కంటే ఎక్కువ వుండే వీడియోస్ ను పంపడం ఎలా?

No comments:

Post a Comment