వాట్సాప్ మెసేజ్ ను ఒకేసారి 5 కంటే ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయటం ఎలా?

whatsapp image
Image Licence: CreativeCommons

మనం తరచుగా ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ను మన కొలీగ్స్ కి గాని లేదా విషెస్ మెసేజ్ లను ఎక్కువ మందికి  ఫార్వర్డ్ చేయటానికి ట్రై చేస్తాము.కానీ వాట్సాప్ లో మనము ఒకేసారి 5 కంటే ఎక్కువ మందికి మెసేజ్ ఫార్వర్డ్ చేయలేము.ఒకసారి 5 మంది కి ఫార్వర్డ్ చేసి తరువాత ఇంకో 5 మందికి ఫార్వర్డ్ చేయాలి.ఇలా కాకుండ సాధారణంగా ఒక గ్రూప్ ని క్రియేట్  చేసి ఒక మెసేజ్ ను ఎక్కువ మందికి ఫార్వర్డ్ చెయ్యొచ్చు.కానీ ఇదంతా కాకుండా ఎటువంటి గ్రూప్ ని క్రియేట్  చెయ్యకుండా మీరు 5 కంటే ఎక్కువ మందికి ఒక మెస్సేజ్ ను ఒకేసారి ఫార్వర్డ్ చెయ్యటానికి ఒక సింపుల్ ట్రిక్ వుంది.

ఇది ఎలాగు అంటే మీరు వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్  పై భాగం లో వున్న three dot symbol పై క్లిక్ చేయండి.తరువాత New Broadcast అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన కాంటాక్ట్స్ ను ఆడ్ చేసుకోండి. మీరు ఈ broadcast list ను క్రియేట్ చేసినట్టు ఎవ్వరికీ ఎటువంటి నోటిఫికేషన్ వెళ్లదు.ఇప్పుడు మీరు ఫార్వర్డ్ చేయాలనుకున్న మెసేజ్ ను సెలెస్ట్ చేసి ఫార్వర్డ్ సింబల్ పై ప్రెస్ చేసి డైరెక్ట్ గా మీరు క్రియేట్  చేసిన broadcast list  కు ఫార్వర్డ్ చేసుకోండి.ఈ టెక్నిక్ వల్ల మీకు చాలా  టైం సేవ్ అవుతుంది.


Also Read: ఏదైనా వెహికల్ డీటెయిల్స్ SMS ద్వారా పొందటం ఎలా?

NOTE: మీరు మా యొక్క అప్డేట్స్ డైరెక్ట్ గా వాట్సాప్ కి పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు