ఒక్కొక్కసారి మనకు ఒక ఇమేజ్ లోని టెక్స్ట్ కావలసి వస్తుంది.ఉదాహరణకు మన దగ్గర కంప్యూటర్ లో ఒక కొటేషన్ యొక్క ఇమేజ్ వుంది అని అనుకుందాం.ఇప్పుడు దానిలోని టెక్స్ట్ మనకు కావాలి అంటే దానిని మొత్తాన్ని టైపు చేయాలి.ఇది చాలా కష్టమయిన పని. మరి మీరు ఏమి కష్టపడకుండా ఇమేజ్ లోని మేటర్ ను text రూపం లోకి మార్చాలంటే ఈ క్రింది టెక్నిక్ ను ఫాలో అయితే సరిపోతుంది.

  • మొదటగా మీరు మీ కంప్యూటర్ లో గూగుల్ డ్రైవ్ లోకి లాగిన్ అవ్వండి.
  • తరువాత లెఫ్ట్ సైడ్ వున్న new అనే దానిని సెలెక్ట్ చేసుకుని file upload మీద క్లిక్ చేయండి.ఇప్పుడు  మీకు కావలసిన ఇమేజ్ ను అప్లోడ్ చెయ్యండి.
  • అప్లోడ్ అయిన తరువాత ఇమేజ్ మీద మౌస్ తో రైట్ క్లిక్ ఇచ్చి open with అనే దాని మీదకు మౌస్ ను తీసుకువెళ్లి  Google Docs అనే దానిపై క్లిక్ చేయండి.
  • మీకు ఒక న్యూ విండో ఓపెన్ అవుతుంది.న్యూ విండో లో మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ తో పాటు దానిలో వున్న మేటర్ text రూపంలో కనపడుతుంది.మీరు ఆ text ను కాపీ చేసుకుని మీ  అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు.

NOTE: మీరు మా యొక్క అప్డేట్స్ డైరెక్ట్ గా వాట్సాప్ కి పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.


    Post a Comment

    సరిక్రొత్తది పాతది