మీరు ఇంస్టాగ్రామ్ వాడుతున్నారా? అయితే మీకు ఒక క్రొత్త ఫీచర్ ను ఇంస్టాగ్రామ్ తీసుకువచ్చింది.దీని ద్వారా  మీరు ఇంస్టాగ్రామ్ అప్లికేషన్ లో ఎంత సేపు స్పెండ్ చేశారో ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ ఉపయోగించకుండా తెలుసుకోవచ్చు.ఇలా తెలుసుకోవటం వల్ల మీరు మీ టైం ను రివైజ్ చేసుకోవచ్చు లేదా అప్లికేషన్ లో మీరు గడిపే టైం ను తగ్గించుకోవచ్చు.

ఈ ఫీచర్ ను మీరు ఉపయోగించాలి అంటే ముందుగా ప్లే స్టోర్ కి వెళ్లి ఇంస్టాగ్రామ్ ను న్యూ వెర్షన్ కి అప్డేట్ చేసుకోవాలి.అప్డేట్ చేసిన తరువాత  మీ ఇంస్టాగ్రామ్ అప్లికేషన్ ని ఓపెన్ చేసి ప్రొఫైల్ లోకి వెళ్ళండి.
తరువాత three dot symbol ని క్లిక్ చేసి Your activity పై క్లిక్ చేయండి.


    


ఇప్పుడు మీరు average గా daily ఎంత టైం ను మీ ఇంస్టాగ్రామ్ అప్లికేషన్ లో స్పెండ్ చేస్తున్నారో కనపడుతుంది.మీరు స్పెండ్ చేసిన టైం ను గ్రాఫ్ రూపం లో కూడా చూపిస్తుంది.మీరు Set daily reminder పై క్లిక్  చేసి మీరు సుమారు ఎంత సేపు అప్లికేషన్ ను వాడదలుచుకున్నారో టైం ను సెట్ చేసుకోవచ్చు.ఇలా టైం ని సెట్ చేసుకుని ఇంస్టాగ్రామ్ ని వాడటం వల్ల డైలీ మీరు సెట్ చేసిన టైం రీచ్ అవగానే మీకు రిమైండర్ వస్తుంది.దీని వల్ల మీ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది.

Post a Comment

సరిక్రొత్తది పాతది