వాట్సాప్ లో మనకు రోజూ చాలా మెసేజ్ లు అలాగే వీడియోస్ మరియు ఫొటోస్ వస్తుంటాయి.కాని మనకు వచ్చిన ఫొటోస్ మరియు వీడియోస్ మొత్తం మన గ్యాలరీ లో కనపడుతాయి.అప్పుడప్పుడు ఇలా కనపడటం మంచిది కాదు.ఎందుకంటే మన ఫోన్ ఇతరులకు ఇచ్చినప్పుడు మన పర్సనల్ ఫొటోస్ కనపడే ప్రమాదం వుంది.

ఇలా కాకుండా వాట్సాప్ లో మీకు వచ్చిన మీడియా మీ గ్యాలరీ లో కనపడకుండా వుండాలి అంటే మీరు ఈ క్రింది విధంగా చెయ్యండి.


మొదట వాట్సాప్ ని ఓపెన్ చేసి Settings కు వెళ్ళండి.తరువాత Chats మీద క్లిక్ చేసి Show media in gallary అనే ఆప్షన్  మీద వున్న టిక్ మార్క్ ను దానిపై క్లిక్ చేయటం ద్వారా తీసివేయండి.ఇలా చేస్తే మీకు వాట్సాప్ లో వచ్చిన మీడియా మీ గ్యాలరీ లో కనపడదు.పైన చెప్పిన విధం గా కాకుండా మీరు మీ వాట్సాప్ లో వున్న కాంటాక్ట్స్ కు individual గా ఈ ఆప్షన్ ను అప్లై చెయ్యవచ్చు.దీని కోసం మీరు మీకు కావలసిన వారి చాట్ విండో ని వాట్సాప్ లో ఓపెన్ చేసి ఈ క్రింద చూపిన చోట క్లిక్ చేసి ఆ తరువాత మీడియా Media visibility పై క్లిక్ చేసి No అని సెట్ చేసి OK  మీద ప్రెస్ చేయండి.
మీరు వాట్సాప్ గ్రూప్ లలో కూడా ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవచ్చు.ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే ఇప్పటికే మీ గ్యాలరీ లో వున్న వాట్సాప్ ఫొటోస్ కు ఈ ఆప్షన్ వర్తించదు.ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసిన తరువాత నుండి వచ్చిన మీడియా కు మాత్రమే ఈ ఆప్షన్ వర్తిస్తుంది.


Also Read: ఈ ఇంస్టాగ్రామ్ క్రొత్త ఫీచర్ తో మీరు అప్లికేషన్ లో ఎంతసేపు గడిపారో తెలుసుకోవచ్చు..!


NOTE: మీరు మా యొక్క అప్డేట్స్ డైరెక్ట్ గా వాట్సాప్ కి పొందాలి అంటే ఈ లింక్  ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.


Post a Comment

సరిక్రొత్తది పాతది