కంప్యూటర్ లో బ్రౌజర్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్ గా Incognito Mode ని ఓపెన్ చెయ్యటం ఎలా?

incognito mode icon

మనం మన కంప్యూటర్ లో ఇంపార్టెంట్ కంటెంట్ ని బ్రౌజ్ చేసినప్పుడు incognito మోడ్ ని యూజ్ చేసి బ్రౌజ్ చేస్తాము.కానీ మనం కంప్యూటర్ లో బ్రౌజర్ ఓపెన్ చేసిన వెంటనే incognito mode ఓపెన్ అవ్వాలి అని అనుకుంటున్నారా?అయితే ఈ క్రింది technique ని ఫాలో అయితే మీరు ఎప్పుడు మీ కంప్యూటర్ లో బ్రౌజర్ ని ఓపెన్ చేసినా కూడా డైరెక్ట్ గా Incognito Mode  మోడ్ లో కి వెళ్తారు.


  • దీనికి  మొదటగా మీ డెస్క్టాప్ మీద వున్న బ్రౌజర్ ని సెలెక్ట్ చేసుకుని దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి.తరువాత properties ని సెలెక్ట్ చేసుకోండి.
  • ఇప్పుడు Target : అని ఒక బాక్స్ కనపడుతుంది. ఆ బాక్స్ చివర మీరు -incognito కీవర్డ్ ని జత చేయండి…

ఉదాహరణకు : బాక్స్ లో ఈ విధంగా  ఉంటే...

"C:\Program Files\UCBrowser\Application\UCBrowser.exe"

దీనికి పైన చెప్పిన కీవర్డ్ యాడ్ చెయ్యండి. అప్పుడు ఇలా కన్పిస్తుంది.

"C:\Program Files\UCBrowser\Application\UCBrowser.exe" -incognito


  • అంతే , తరువాత APPLY మీద క్లిక్ చేసి OK మీద క్లిక్ చేయండి.ఇప్పుడు మీరు బ్రౌజర్ ని మామూలుగా ఓపెన్ చెయ్యటానికి ప్రయత్నించండి.
  • బ్రౌజర్ ని ఓపెన్ చేయగానే మీకు INCOGNITO MODE ఓపెన్ అవుతుంది.
  • ఒకవేళ  మీరు ఈ సెట్టింగ్ తీసివేయాలి అనుకుంటే పైన చెప్పిన టార్గెట్ బాక్స్ లో -incognito ని తొలగించండి .
ఈ technique కొన్ని బ్రౌజర్లు లకు తప్ప దాదాపు అన్ని బ్రౌజర్ లకు పని చేస్తుంది.

NOTE: మీరు మా యొక్క అప్డేట్స్ డైరెక్ట్ గా వాట్సాప్ కి పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి..

Post a Comment

0 Comments