మనము  రోజూ ఆండ్రాయిడ్ ఫోన్ లో మల్టీ-టాస్కింగ్ చేస్తాము.అంటే ఒకేసారి  రెండు లేదా అంత కంటే ఎక్కువ అప్లికేషన్స్ ను ఉపయోగిస్తాము.దీనికి సాంగ్స్ వింటూ గేమ్స్ ఆడటం అనేది ఒక ఉదాహరణ.ఇది ఇలాగు ఉంచితే ఆండ్రాయిడ్ లో లభించే చాలా అప్లికేషన్స్ ఈ మల్టీ-టాస్కింగ్ ను సపోర్ట్ చేస్తాయి.కానీ యూట్యూబ్ అప్లికేషన్ మాత్రము సపోర్ట్ చెయ్యదు.అంటే మీరు యూట్యూబ్ లో ఏదయినా వీడియో ప్లే చేసి హోమ్ స్క్రీన్ కి రాగానే వీడియో ఆగిపోతుంది.దీనికి సంబంధించి యూట్యూబ్ లో ఎటువంటి ఆప్షన్ లేదు.కానీ ఈ రోజు నేను మీకు ఒక టెక్నిక్ చెప్తాను.దీనిని వుపయోగించి మీరు యూట్యూబ్ వీడియోస్ లను బ్యాగ్రౌండ్ లో ప్లే చెయ్యొచ్చు(వినవచ్చు).దీనికి మీరు క్రింది స్టెప్స్ ను ఫాలో అవ్వండి.

  • మీరు మొదటగా మీ ఆండ్రాయిడ్ లో క్రోమ్ బ్రౌసర్ ను ఓపెన్ చేయండి.
  • తరువాత క్రోమ్ బ్రౌసర్ పైన వున్న three dot symbol ని క్లిక్ చేసి Desktop Site ని ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు క్రోమ్ బ్రౌసర్ సెర్చ్ బార్ లో youtube.com అని టైపు చేసి సెర్చ్ చేయండి.

  • ఇప్పుడు మీరు బ్యాగ్రౌండ్ లో వినాలి అనుకున్న వీడియో ని యూట్యూబ్ సెర్చ్ బార్ లో సెర్చ్ చేసి ప్లే చెయ్యండి.
  • తరువాత మీరు మీ హోమ్ స్క్రీన్  కి వెళ్ళండి.వీడియో ప్లే అవ్వటం ఆగిపోతుంది.కానీ ఏమి కంగారు పడకండి.మీరు మీ నోటిఫికేషన్ బార్ ను ఓపెన్ చేసి చూస్తే మీకు క్రోమ్ బ్రౌసర్ కి సంబందించిన ఒక నోటిఫికేషన్ లో play సింబల్ కనపడుతుంది.మీరు దానిని క్లిక్ చేస్తే మీ వీడియో ను బ్యాగ్రౌండ్ లో కూడా వినగలుగుతారు.ఈ టెక్నిక్ సరిగ్గా పనిచేయాలి అంటే మీరు క్రోమ్ బ్రౌసర్ ను బ్యాగ్రౌండ్ లో రన్ అయ్యేలా చూసుకోండి.
Post a Comment

సరిక్రొత్తది పాతది