ఫేస్ బుక్ లో కొంతమంది కొన్ని పోస్ట్ లు పెట్టినప్పుడు ఎక్కువ లైక్స్  కోసం లేదా వారి పోస్ట్ వైరల్ అవ్వడానికి tagging ఫీచర్ ను ఉపయోగిస్తారు.దీని వల్ల మనకు చాలా ఇబ్బంది కరంగా వుంటుంది.ప్రతి కామెంట్ కు,లైక్స్ కు మీకు notifications వస్తాయి మరియు మీకు నచ్చని పోస్ట్ లు కూడా మీ టైం లైన్ లోకి వచ్చే అవకాశం ఉంది.

దీని సొల్యూషన్ గా నేను ఈ ఆర్టికల్ లో మీరు ఏదయినా పోస్ట్ లో ట్యాగ్ అయితే  మీరంతట మీరే ఎలా untag చేసుకోవచ్చో‌‌ చెప్తాను.ఇలా చెయ్యటం వల్ల మీరు మొహమాటపు పరిస్థితుల నుండి తప్పించుకోవచ్చు.దీనికి ఈ క్రింది స్టెప్స్ ని ఫాలో అవ్వండి.


  • మొదటగా మీరు ట్యాగ్ అయిన పోస్ట్ కు మీ ప్రొఫైల్ ని ఓపెన్ చేసి గానీ లేదా మిమ్మల్ని ట్యాగ్ చేసిన వారి ప్రొఫైల్ ని ఓపెన్ చేసి కాని వెళ్ళండి.
  • తరువాత మీరు టాగ్ అయి వున్న పోస్ట్ కు పైన వున్న three dot symbol ని క్లిక్ చేయండి.
  • తరువాత Remove tag పై క్లిక్ చేయండి.


  • వెంటనే ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.మీరు CONFIRM పైన క్లిక్ చేయండి.అంతే మీరు ఆ పోస్ట్ నుండి అన్ టాగ్ అయిపోతారు
NOTE: మీరు మా యొక్క అప్డేట్స్ డైరెక్ట్ గా వాట్సాప్ కి పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి..


Post a Comment

సరిక్రొత్తది పాతది