వాట్సాప్ ను ఉపయోగించి మనము రోజూ కమ్యూనికేట్ చేసుకుంటాము.దీనికి వాట్సాప్ లో మనము టెక్స్ట్ ను,ఎమోజిలను ఉపయోగించుకుంటాము.ఈ మధ్యనే వాట్సాప్ లో క్రొత్తగా స్టిక్కర్స్ ఫీచర్  వచ్చింది.దీనిని ఉపయోగించి మీరు వేరే వాళ్లకి స్టిక్కర్లు ను పంపుకోవచ్చు.ఇది ఇలాగు ఉంచితే ఒక్కోసారి మనకు వాట్సాప్ లో వివిధ మెసేజ్ వస్తాయి.వాటిలో అక్షరాలు బ్లూ కలర్ లో లేదా వివిధ ఫాంట్స్ తో ఉంటాయి.అలాంటి మెసేజ్ లను మీరు కూడా మీ ఫ్రెండ్స్ కు పంపవచ్చు.

దీనికి మీ ఆండ్రాయిడ్ లో Stylish Text అనే అప్లికేషన్ ను ఉపయోగించి పంపించవచ్చు.దీనిని మీరు ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుని మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోండి.ఇన్స్టాల్ చేసుకున్న తరువాత ఓపెన్ చేసి next అనే దానిపై కొన్ని సార్లు క్లిక్ చేయండి.తరువాత ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది మీరు దానిమీద క్లిక్ చేస్తే మిమ్మల్ని overlay పర్మిషన్ అడుగుతుంది.మీరు పర్మిషన్ యివ్వాలి అని అనుకుంటే ఇవ్వండి లేదా సింపుల్ గా బ్యాక్ బటన్ పై ప్రెస్ చేయండి.ఇప్పుడు మీకు ఒక టెక్స్ట్ బాక్స్ కనపడుతుంది.దానిలో మీకు నచ్చిన టెక్స్ట్ ను టైపు చేయగానే మీకు క్రింద చాలా ఫాంట్స్ కనపడతాయి.మీరు మీకు నచ్చిన ఫాంట్స్  ని హోల్డ్ చేసి ఉంచితే టెక్స్ట్ కాపీ అవుతుంది . కాపీ చేసిన టెక్స్ట్ ను మీ వాట్సాప్ లో పేస్ట్ చేసి పంపుకోవచ్చు.దీనిలో ఇంకా  చాలా ఆప్షన్స్ మరియు ఫీచర్స్ కూడా  వున్నాయి.

Also Read: వాట్సాప్ స్టిక్కర్లు ఆండ్రాయిడ్ కి కూడా వచ్చేశాయ్..!

NOTE: మీరు మా యొక్క అప్డేట్స్ డైరెక్ట్ గా వాట్సాప్ కి పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Post a Comment

సరిక్రొత్తది పాతది