Translate

19, నవంబర్ 2018, సోమవారం

అనస్థీషియా అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?

A dentist
Licence: CreativeCommons
పూర్వకాలం లో ఏదయినా దెబ్బ తగిలి కుట్లు వేయవలసి వచ్చినప్పుడు లేదా వివిధ సందర్భాల్లో శస్త్ర చికిత్సలు చేయవలసి వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఎటువంటి మత్తు మందు ఇవ్వకుండా చేసే వారు.అలా చెయ్యటం వల్ల అప్పటి ప్రజలు చాలా యిబ్బంది పడేవారు మరియు చాలా బాధని అనుభవించాల్సి వచ్చేది.కానీ ఈ కాలంలో ఏదయినా చికిత్స చేయవలసి వచ్చి నప్పుడు డాక్టర్లు ఎక్కువగా మత్తు మందు ని ఇచ్చి  తరువాత చికిత్స చేస్తున్నారు.ఈ మత్తు మందునే  అనస్థీషియా అంటారు.


మామూలుగా మన శరీరం లో ఏదయినా దెబ్బతగిలినప్పుడు నొప్పి వేస్తుంది.ఈ నొప్పి కి కారణం మన శరీరం లో ని నాడులు మన బ్రెయిన్ కి నొప్పి సిగ్నల్స్ ను చేరవేయటమే.ఒక వేల మన నాడులు నొప్పిని బ్రెయిన్ కి చేరవేయకపోతే మనకు నొప్పి అనేది ఉండదు. అనస్థీషియా కూడా దీనిని బేస్ గా చేసుకుని పనిచేస్తుంది.మన శరీరం లో ఒక భాగంలో అనస్థీషియా యిచ్చినప్పుడు అక్కడి నాడులు నొప్పి ని బ్రెయిన్ కి చేరవేయకుండా ఉంటాయి.ఫలితం గా మనకు నొప్పి లేకుండా మొద్దుబారి నట్టు అనిపిస్తుంది.


ఈ అనస్తేషియా ను ముఖ్యంగా రెండు రకాలుగా విభజించారు.ఒకటి లోకల్ అనేస్తేషియా రెండవది జనరల్ అనేస్తేషియా .లోకల్ అనేస్తేషియా ను చిన్న చికిత్సలకు వాడతారు. మరియు దీనిని ఒకే ప్రదేశం లో అప్లై చేస్తారు.దీని వల్ల చికిత్స చేసే ప్రదేశం లో మొద్దు బారి నట్లు ఉంటుంది కానీ మనిషి చేతనా వ్యవస్థ లో నే ఉంటాడు. జనరల్ అనేస్తేషియా ను పెద్ద పెద్ద శస్త్ర చికిత్సలకు ఉపయోగిస్తారు.ఇది మొత్తం శరీరం మీద ప్రభావాన్నిచూపుతుంది.దీనిలో మనిషి నిశ్చేతన వ్యవస్థ లో ఉంటాడు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి