Latest

"Genius is one percent inspiration, ninety-nine percent perspiration"--Thomas Edison

Thursday, December 13, 2018

గూగుల్ క్రోమ్ బ్రౌసర్ లో మీకు తెలియని సీక్రెట్ సెట్టింగ్..!

google chrome browser home page

మీరు గూగుల్ క్రోమ్ బ్రౌసర్ ను వాడేటప్పుడు క్రోమ్ యొక్క హోమ్ స్క్రీన్ కి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందికరం గా ఉంటుంది.మీరు వున్నపేజీ నుంచి క్రోమ్ హోమ్ స్క్రీన్ కి బ్యాక్ బటన్ ని ప్రెస్ చేస్తూ వెళ్ళాలి లేదా ఇంకొక టాబ్ ను ఓపెన్ చెయ్యటం ద్వారా హోమ్ స్క్రీన్ కు వెళ్ళవచ్చు.కానీ మీరు మీ సెర్చ్ బార్ దగ్గర హోమ్ బటన్ ను యాడ్ చేసుకుని మీరు ఈజీ గా మీ క్రోమ్ యొక్క హోమ్ స్క్రీన్ కు వెళ్ళవచ్చు.దీనికి ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవ్వండి.


  • మొదట మీరు ఈ క్రింది అడ్రస్ ను కాపీ చేసుకోండి.
          chrome://flags/#force-enable-home-page-button
  • తరువాత మీ క్రోమ్ బ్రౌసర్ ను ఓపెన్ చేసి అడ్రస్ బార్ లో మీరు కాపీ చేసిన దానిని పేస్ట్ చేసి సెర్చ్ బటన్ పై  క్లిక్ చెయ్యండి.
  • మీకు ఈ క్రింది విధం గా ఒక ఆప్షన్ వస్తుంది.

  • మీరు ఈ ఆప్షన్ ను ఎనేబుల్ చేసి RELAUNCH NOW అనే దాని మీద క్లిక్ చేయండి.అప్పటికీ కూడా మీకు హోమ్ బటన్ రాకపోతే ఒక సారి మీ క్రోమ్ బ్రౌసర్ ను ఫోర్స్ స్టాప్ చేసి మరలా ఓపెన్ చెయ్యండి.
(ఫోర్స్ స్టాప్ చేయుటకు మీ ఫోన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి apps ను సెలెక్ట్ చేసుకుని తరువాత గూగుల్ క్రోమ్ పై టాప్ చేసి అక్కడ వుండే force stop అనే దానిపై క్లిక్ చేయండి.)
 క్రోమ్ బ్రౌసర్ ను ఓపెన్ చేయగానే సెర్చ్ బార్ దగ్గర హోమ్ బటన్ ప్రత్యక్షమవుతుంది.


Bonus Tip:

మీరు క్రోమ్ బ్రౌజరు లో ఒక టాబ్ నుంచి ఇంకో టాబ్ కి వెళ్ళటానికి టాబ్ బటన్ ని క్లిక్ చేయకుండా డైరెక్ట్ గా సెర్చ్ బార్ మీద ఫింగర్ తో కుడి లేదా ఎడమ చేతి వైపు swipe చేయటం ద్వారా  మీరు ఒక  టాబ్ నుంచి మరో టాబ్ కు ఈజీ గా మారవచ్చు.




No comments:

Post a Comment