Translate

19, డిసెంబర్ 2018, బుధవారం

PUBG ఆడే ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోవలసిన అప్లికేషన్


PUBG కార్పోరేషన్ విడుదల చేసిన PUBG(PlayerUnknown's BattleGrounds) గేమ్ చాలా ఫేమస్ అయిపొయింది.చాలా మంది ఈ గేమ్ ను ఆడటం మొదలు పెట్టారు.ఇది ఎంత ఫేమస్ అయ్యింది అంటే కొన్ని రోజుల క్రితం జరిగిన ప్లే స్టోర్ అవార్డ్స్ లో దీనికి  మొదటి స్థానం లభించింది.

PUBG లో ఎప్పుడూ మొదటి స్థానం రావాలి అంటే మీరు మొదటగా ఎక్కడ  లూట్ ఎక్కువగా ఉంటుంది మరియు ఏ ఏ గన్స్ పవర్ఫుల్ అనే మొదలయిన వాటిని తెలుసుకోవాలి.PUBG లో లభించే వస్తువులు,గన్స్ గురించి చాలా మందికి అవగాహన లేదు.అంతే కాక ఎక్కడ వెహికిల్స్ వుంటాయో మరియు ఎక్కడ లూట్ ఎక్కువగా ఉంటుందో కూడా చాలా మందికి కన్ఫ్యూషన్ గా ఉంటుంది.



ఈ కన్ఫ్యూషన్ ని ప్లే స్టోర్ లో దొరికే ఒక మంచి అప్లికేషన్ పోగొడుతుంది.దీని పేరు Battleground Companion.దీనిని ఇన్స్టాల్ చేసుకుని మీరు PUBG లో ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ లోకి రావొచ్చు.ఎందుకంటే దీనిలో ఏ గన్ చాలా పవర్ ఫుల్ దాని యొక్క డామేజ్ ఎంత? ఎక్కడ ఎక్కువ లూట్ దొరుకుతుంది ,ఎక్కడ ఎక్కువ మంది ప్లేయర్స్ దిగుతారు అనే మొదలయిన వాటిని స్పష్టం గా వివరించటం జరిగింది.దీనిని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ అప్లికేషన్ ను మీరు ఈ క్రింద  వున్న డౌన్లోడ్ సింబల్ ని  ప్రెస్ చేసి డౌన్లొడ్ చేసుకోవచ్చు.



వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి