ఆన్లైన్ లో ఎలక్ట్రానిక్ లేదా అనేక రకాల వస్తువులని కొనుక్కునే వారి సంఖ్య గణనీయం గా పెరుగుతుంది.చాలా మంది బయట కాకుండా ఆన్లైన్ లోనే ఆర్డర్ ను ప్లేస్ చేసి ప్రొడక్ట్ లను కొనుగోలు చేస్తున్నారు.దీనికి కారణం ఆన్లైన్ లో వస్తువులు కొంత చవకగా లభించటం మరియు మనకు మార్కెట్ లో దొరకని వస్తువులు కూడా ఆన్లైన్ లో దొరకటం.


ఏది ఏమయినా మీరు ఆన్లైన్ లో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు స్పెసిఫికేషన్స్ చూడటం మరియు అమెజాన్,ఫ్లిప్కార్ట్ వంటి వాటిలో ధరలను చెక్ చేయడం సహజం.దీనివల్ల  మీ విలువయిన సమయం వేస్ట్ అవుతుంది.ఈ సమస్యని దృష్టిలో ఉంచుకుని గూగుల్ ఒక క్రొత్త ఫీచర్ ను తెచ్చింది.అదే గూగుల్ షాపింగ్.దీని ద్వారా మీరు మీకు కావలసిన ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ తో పాటు ఆ ప్రొడక్ట్  ఏ ఏ వెబ్సైటు లలో ఎంతకు విక్రయించబడుతుంది.అని తెలుసుకోవచ్చు.దీనికి మీరు ఈ వెబ్సైటు కు వెళ్లి మీకు కావలసిన ప్రోడక్ట్ ను సెర్చ్ బార్ లో ఎంటర్ చేసి సెర్చ్ చేసుకుంటే చాలు.
మీరు ఇంకో మెథడ్ ద్వారా గూగుల్ లో మీకు కావాల్సిన ప్రొడక్ట్ ను గూగుల్ లో ఎంటర్ చేసి గూగుల్ సెర్చ్ బార్ క్రింద వుండే ట్యాబు లలో షాపింగ్ ను సెలెక్ట్ చేసుకుని మీరు ఈ ఫీచర్ ను ప్రయత్నించవచ్చు.


గూగుల్ తెచ్చిన ఈ ఫీచర్ వళ్ళ మీకు డబ్బులు,సమయం  ఆదా అవుతాయి.గూగుల్ తెచ్చిన ఈ ఫీచర్ ను మీరు ఈ వెబ్సైటు లోకి వెళ్లి నుండి ప్రయత్నించవచ్చు.


Read Also: గూగుల్ క్రోమ్ బ్రౌసర్ లో మీకు తెలియని సీక్రెట్ సెట్టింగ్..!

Read Also: అన్ని న్యూస్ పేపర్స్ ను ఆన్లైన్ లో ఫ్రీ గా చదవటం ఎలా?


Post a Comment

సరిక్రొత్తది పాతది