ఫేస్ బుక్ మరియు వాట్సాప్ తరువాత చాలా ఫేమస్ అయిన platform ఇంస్టాగ్రామ్.రోజూ చాలా మంది తమ యొక్క ఫొటోస్ మరియు వీడియోస్ లను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటున్నారు.కొన్ని రోజుల క్రితం ఇంస్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజెస్ అనే ఫీచర్ తీసుకు రావడం వల్ల వాట్సాప్ లో లాగా మన ఇంస్టాగ్రామ్ ఫ్రెండ్స్ కు కూడా మెసేజ్ లను పంపుకోవచ్చు అనే విషయం తెలిసిందే.కానీ మనము వాయిస్ మెసేజ్ లను పంపుకోవడం సాధ్యపడేది కాదు.

ఈ సమస్యకు సమాధానం గా ఇప్పుడు  ఇంస్టాగ్రామ్ వాయిస్ మెసేజ్ ఫీచర్ ను తీసుకువచ్చింది.దీని ద్వారా మీరు మీ ఇంస్టాగ్రామ్ ఫ్రెండ్స్ కి వాయిస్ మెసేజ్ లను పంపుకోవచ్చు.

మీరు వాయిస్ మెసేజ్ లను పంపడానికి ఇంతకముందు లాగానే ఇంస్టాగ్రామ్ ని ఓపెన్ చేసి ఈ క్రింద మార్క్ చేసిన సింబల్ మీద క్లిక్ చేసి మీకు కావలసిన conversation ను ఓపెన్ చేయండి.తరువాత అక్కడ conversation  విండో లో కనిపించే మైక్ సింబల్ ని హోల్డ్ చేసి వాయిస్ ను రికార్డు చేసి దాన్ని రిలీజ్ చెయ్యటం ద్వారా వాయిస్ మెసేజ్ ను పంపవచ్చు.మీరు రికార్డు చేస్తున్న వాయిస్ మెసేజ్ మధ్యలోనే వద్దు అని  అనుకుంటే రికార్డు చేసే సమయం లో మైక్ మీద వున్న ఫింగర్ ను ఎడమ ప్రక్క వున్న డిలీట్ symbol మీదకు స్వైప్ చేస్తే  చాలు మీ మెసేజ్ మీ ఫ్రెండ్ కి వెళ్లకుండా డిలీట్ అయిపోతుంది.

ఈ ఇంస్టాగ్రామ్ క్రొత్త ఫీచర్ ద్వారా చాటింగ్ చేయటం చాలా సులభం అవటమే కాకుండా టైపింగ్ చేసేటప్పుడు వచ్చే typing mistakes నుంచి కూడా తప్పించుకోవచ్చు.Post a Comment

సరిక్రొత్తది పాతది