Latest

"Genius is one percent inspiration, ninety-nine percent perspiration"--Thomas Edison

Monday, December 31, 2018

కంప్యూటర్ లో ఎటువంటి అప్లికేషన్ లేకుండా VPN ను సెట్ చేసుకోవటం ఎలా?

How to Setup a VPN Server on Windows 10 PC Without Any Software in Telugu


మనలో చాలా మందికి VPN గురించి తెలిసిందే.VPN ను వాడటం వల్ల మన యొక్క IP అడ్రస్ చేంజ్ అవుతుంది తద్వారా మన కంట్రీ లో బ్లాక్ చేసిన వెబ్సైట్ ను ఓపెన్ చెయ్యొచ్చు.మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే ప్లే స్టోర్ లో దొరికే చాలా ఫ్రీ మరియు పైడ్ వెర్షన్ అప్లికేషన్స్ ను వుపయోగించి VPN ను సెట్ చేసుకోవచ్చు.

కానీ కంప్యూటర్ లో VPN ను సెట్ చేసుకోవటం కొంచం కష్టం గా ఉంటుంది ఎందుకంటే కంప్యూటర్ కు VPN అప్లికేషన్స్ ఎక్కువగా వుండవు ఒక వేళ వుంటే వాటికి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.

కానీ ఈ ఆర్టికల్ లో నేను మీరు కంప్యూటర్ లో ఫ్రీ గా అదీ ఎటువంటి అప్లికేషన్ లేకుండా VPN ఎలా సెట్  చేసుకోవచ్చో చెప్తాను.VPN ను ఫస్ట్ క్రియేట్ చెయ్యటం కొంచం కన్ఫ్యూషన్ గా ఉండొచ్చు గాని ఒకసారి క్రియేట్ చేసాక మీరు సింపుల్ గా కనెక్ట్ చేసుకుంటే చాలు.


  • మొదటగా మీరు క్రింది వెబ్సైటు ను ఓపెన్ చేయండి.
           https://www.vpnbook.com/freevpn

  • తరువాత అక్కడ  Free PPTP VPN దగ్గర వున్న సర్వర్ నేమ్స్ లో మీకు నచ్చిన సర్వర్ అడ్రస్ ను కాపీ చేసుకోండి.
  • మీ కంప్యూటర్ లో settings లోకి వెళ్లి Network & Internet సెట్టింగ్ లో కి వెళ్లి పక్కన వున్న లిస్ట్ లో VPN ను సెలెక్ట్ చేసుకోండి.తరువాత Add VPN connection అనే దానిపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీరు VPN provider దగ్గర మౌస్ తో క్లిక్ చేసి Windows(built-in) అని సెలెక్ట్ చేయండి.
  • తరువాత Connection name దగ్గర మీకు నచ్చిన పేరు ను ఇవ్వండి.
  • తరువాత Server name or address అనే చోట మీరు ఇందాక కాపీ చేసిన అడ్రస్ ను ఇవ్వండి.
  • VPN type అనే దగ్గర  Point to Point Tunneling Protocol అని సెట్ చెయ్యండి.
  • Type of sign-in info దగ్గర User name and password అని ఉంచండి.
  • Username (optional) దగ్గర మీరు vpnbook మరియు Password(optional) దగ్గర 283swrn అని ఇవ్వండి. [ఇవి మీరు ఇందాక విసిట్ చేసిన వెబ్సైటు లోని సర్వర్స్ నేమ్స్ దగ్గర ఉండటం గమనించవచ్చు.]
గమనిక: ఈ Password మరియు username అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి.కనుక మీరు ఒకసారి పైన చెప్పిన వెబ్సైటు లోని server names దగ్గర వున్న username మరియు password లను సరిచూసుకోవలసినదిగా కోరుకుంటున్నాము.
  • ఇప్పుడు Save బటన్ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీ VPN సెట్టింగ్ దగ్గర మీరు క్రియేట్  చేసిన VPN పేరు వస్తుంది మీరు దానిపై క్లిక్ చేసి Connect అనే దానిపై క్లిక్ చేయండి.


అంతే మీరు VPN కు కనెక్ట్ అయిపోయారు.ఇప్పుడు మీ కంట్రీ లో బాన్ అయిన వెబ్సైట్స్ ను సందర్శించవచ్చు.మీరు ఈ VPN కనెక్షన్ ను ఆపాలి అని అనుకుంటే ఇందాకలాగే VPN సెట్టింగ్స్ లోకి వెళ్లి మీరు కన్సెట్ అయిన VPN ను క్లిక్ చేసి Disconnect అనే దాని మీద క్లిక్ చేయండి.

Also Read: PUBG ఆడే ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోవలసిన అప్లికేషన్


Note: మీకు ఇలాంటి పోస్ట్ లు డైరెక్ట్ గా మీ వాట్సాప్ కి రావాలి అంటే ఈ లింక్ ద్వారా మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.లేదా ఈ లింక్ ద్వారా మా ఫేస్ బుక్ పేజీ ను లైక్ చేసి ఫాలో అవ్వండి.

No comments:

Post a Comment