వాట్సాప్ ను ఫేస్ బుక్ సొంతం చేసుకున్నప్పటి  నుండి వాట్సాప్ లో చాలా క్రొత్త  ఫీచర్స్ వస్తున్నాయి.ఈ మధ్యనే వచ్చిన swipe to reply ఫీచర్ ద్వారా మనకు వచ్చిన మెసేజ్ ను కుడి ప్రక్కకు చేయటం ద్వారా రిప్లై ను ఇవ్వవచ్చు.మరియు వాట్సాప్ స్టిక్కర్ల ఫీచర్ ద్వారా మనము చాలా రకాల స్టిక్కర్లను మన ఫ్రెండ్స్ కు పంపుకోవచ్చు.


ఇది ఇలాగు ఉంచితే వాట్సాప్ మరొక ప్రయోజనకరమైన ఆప్షన్ ను తీసుకురాబోతుంది.అదే Dark Mode.ఈ డార్క్ మోడ్ ని ఉపయోగించటం వల్ల మీరు మీ కళ్ళకి కలిగే ఒత్తిడి ని తగ్గించుకోవచ్చు,అలాగే మీ ఆండ్రాయిడ్ బ్యాటరీ ని కూడా ఆదా చేసుకోవచ్చు అని కొంతమంది డెవలపర్ల  యొక్క అభిప్రాయం.ఈ Dark Mode ఆల్రెడీ యూట్యూబ్ తో పాటు చాలా అప్లికేషన్స్ లో అందుబాటులో వుంది.వాట్సాప్ కూడా ఈ ఫీచర్ ను డెవలప్ చేస్తున్నట్లు ప్రముఖ వాట్సాప్ న్యూస్ బ్లాగ్ WABetaInfo ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.కానీ దీని గురించి వాట్సాప్ అఫీషియల్ గా ఎలాంటి సమాచారం ఇంకా ఇవ్వలేదు.WABetainfo చేసిన ట్వీట్ ను మీరు క్రింద చూడవచ్చు.


Read Also: అన్ని న్యూస్ పేపర్స్ ను ఆన్లైన్ లో ఫ్రీ గా చదవటం ఎలా?

Read Also:  అన్ని రకాల బుక్స్ ను ఆన్లైన్ లో ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోవటం ఎలా?

Post a Comment

సరిక్రొత్తది పాతది