Translate

17, డిసెంబర్ 2018, సోమవారం

వాట్సాప్ లో రానున్న 5 అద్భుతమయిన ఫీచర్స్ ఇవే..!

Image License:Creative Commence

ఫేస్ బుక్ సంస్థ వాట్సాప్ ను సొంతం చేసుకున్నప్పటి నుంచి వాట్సాప్ లో వివిధ ఫీచర్స్ వస్తున్నాయి.ఈ మధ్యనే వాట్సాప్ స్టిక్కర్లు  ద్వారా మనము మనం ఫ్రెండ్స్ కు స్టిక్కర్ లను పంపించుకునే సదుపాయాన్ని తీసుకువచ్చింది.కొన్ని సామాజిక మాధ్యమాలు మరియు WABetaInfo ట్వీట్స్ ద్వారా వాట్సాప్ ఇంకా చాలా అద్భుతమయిన ఫీచర్స్ ను తీసుకువస్తుందని తెలుస్తుంది.వాట్సాప్ తీసుకురానున్న ఫీచర్స్  ఈ
క్రింద వివరించబడ్డాయి.


Dark Mode

వాట్సాప్ లో కూడా ఇతర అప్లికేషన్స్ లాగా dark mode ఫీచర్ తేనున్నట్లు WABetaInfo చేసిన ఒక ట్వీట్ ద్వారా తెలుస్తుంది.ఇది ఇంకా development స్టేజి లోనే వుంది.దీని ద్వారా మీరు వాట్సాప్ లో డార్క్ మోడ్ ను అంటే డార్క్ థీమ్ ను పొందవచ్చు.ఈ ఫీచర్ ని ఉపయోగించటం వళ్ళ మీ యొక్క కంటి మీద తక్కువ ప్రభావం పడుతుంది.ఎక్కువగా వాట్సాప్ వాడే వారు ఈ ఫీచర్ వళ్ళ చాలా లాభపడతారు.



Share via QR code

మనము ఎప్పుడయినా మన ఫ్రెండ్స్ ను కలిసినప్పుడు వాళ్ళ వాట్సాప్ నెంబర్ అడిగి సేవ్ చేసుకుంటాము.దీనికి చాలా టైం పడుతుంది.ఇలా కాకుండా వాట్సాప్ లో వచ్చే ఈ ఫీచర్ ను వుపయోగించి మీరు మీ వాట్సాప్ లో QR కోడ్ ను create చేసుకోవచ్చు.దీనిలో మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది.వేరే వ్యక్తి తన వాట్సాప్ అప్లికేషన్ తో మీ QR కోడ్ ను స్కాన్ చేయగానే వాళ్ళ మొబైల్ లో మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆటోమాటిక్ గా వాళ్ళ అడ్రస్ బుక్ లో స్టోర్ అవుతుంది.సో,మీరు వాళ్ళ నెంబర్ తీసుకుని ఫోన్ లో కష్టపడి టైపు చేసి సేవ్ చేసుకోవలసిన అవసరం ఉండదు.


Group calling

ఎప్పుడు నుంచో వాట్సాప్ లో ఎదురు చూస్తున్న ఫీచర్ గ్రూప్ కాలింగ్.ఈ ఫీచర్ వళ్ళ మీరు గ్రూప్ లో వున్న ఫ్రెండ్స్ తో ఒకేసారి మాట్లాడవచ్చు.ఈ ఫీచర్ ఆల్రెడీ IOS లో అందుబాటులోకి వచ్చింది.అలానే ఆండ్రాయిడ్ బీటా యూసర్ కు కూడా అందుబాటులోకి వచ్చింది.కానీ దీనిని వుపయోగించి మీరు కేవలం ఒకేసారి ముగ్గురు గ్రూప్ మెంబెర్స్ తో మాత్రమే మాట్లాడటానికి వీలువుంది.


Ranking feature

ఈ ఫీచర్ కు వాట్సాప్ లో ఉపయోగించిన అల్గోరిథం  మనము  వాట్సాప్ లో ఎవరితో ఎక్కువగా చాట్ చేసాము,ఎవరితో ఎక్కువగా కాల్స్ ను చేసాము లాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని మనము ఎవరితోనయితే ఎక్కువ గా ఇంటరాక్ట్ అవుతున్నామో వారి యొక్క వాట్సాప్ స్టేటస్ ను ఫస్ట్ లో ఉంచి మిగిలిన వారి స్టేటస్ లు తరువాత ఉంచుతుంది.


Media preview

మీకు ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు నోటిఫికేషన్ బార్ లో ప్రివ్యూ చూపిస్తుంది.అలానే ఈ ఫీచర్ ద్వారా ఎవరైనా మీకు వాట్సాప్ లో వీడియో పంపించి నప్పుడు మీరు ఆ వీడియో ను వాట్సాప్ ఓపెన్ చెయ్యకుండా డైరెక్ట్ గా నోటిఫికేషన్ బార్  నుంచే చూడవచ్చు.



Read Also: ఫేస్ బుక్ వీడియోస్ ను డౌన్లోడ్ చెయ్యటం ఎలా?

Read Also: ఎటువంటి అప్లికేషన్స్ ఉపయోగించకుండా యూట్యూబ్ వీడియోస్ డౌన్లోడ్ చెయ్యటం ఎలా?

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి