యూట్యూబ్ ఎప్పటి కప్పుడు యూజర్స్ యొక్క అభిరుచులకు తగ్గట్టుగా క్రొత్త  ఫీచర్స్ ను తెస్తుంది.ఈ మధ్యనే యూట్యూబ్ లో కళ్ళకు కొంచం స్ట్రైన్ ని తగ్గించేందుకు డార్క్ మోడ్ ను కూడా ప్రవేశపెట్టింది.ఇది ఈలాగు ఉంచితే ఇప్పుడు యూట్యూబ్ ఒక క్రొత్త ఫీచర్ ను తెచ్చింది.అదే 'Autoplay on home',ఈ ఆప్షన్ వళ్ళ మీరు మీ మొబైల్ లో యూట్యూబ్ application ని ఓపెన్ చేసినప్పుడు హోమ్ స్క్రీన్ లోని వీడియోస్ కి వున్న థంబ్ నెయిల్  ఒక్క క్షణం చూపించడం తో పాటు వీడియో కూడా సౌండ్ లేకుండా ఆటోమేటిక్ గా ప్రివ్యూ అవుతుంది.దీని వల్ల ఆ వీడియో నిజం గా థంబ్ నెయిల్ కి తగ్గట్టు వుందా, ఆ వీడియో లో మనకి కావలసిన కంటెంట్ వుందా లేదా అని తెలిసిపోతుంది.ఈ ఆప్షన్ ను మీరు ఉపయోగించుకోవాలి అంటే మీరు ముందుగా ప్లే స్టోర్ కి వెళ్లి యూట్యూబ్ అప్లికేషన్ ను అప్డేట్ చేసుకుకోవాలి.ఈ ఆప్షన్ డిఫాల్ట్ గా ఎనేబుల్  చేయబడి వుంటుంది.మీరు దీనిని ఎడిట్ చేయాలి అని అనుకుంటే యూట్యూబ్ అప్లికేషన్ ను ఓపెన్ చేసి కుడు ప్రక్కన పైన వున్న ఐకాన్ ను క్లిక్ చేసి సెట్టింగ్స్  కు వెళ్ళండి.


                              తరువాత Autoplay అనే దానంపై క్లిక్ చేయండి.ఇప్పుడు మీరు Autoplay on home అనే దానిపై క్లిక్ చేసి ఈ ఆప్షన్ ను మీకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు.


      ఈ ఆప్షన్ వల్ల మీకు చాలా వరకు యూట్యూబ్ లో టైం సేవ్ అవుతుంది.


NOTE: మీరు మా యొక్క అప్డేట్స్ డైరెక్ట్ గా వాట్సాప్ కి పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Post a Comment

సరిక్రొత్తది పాతది