విండోస్ 10 లో ప్రతి అప్లికేషన్ యొక్క సౌండ్ ను సెపెరేట్ గా కంట్రోల్ చెయ్యటం ఎలా?

How to Adjust Sound For Individual Programs in Windows 10


మనము కంప్యూటర్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం లో సౌండ్ ను కంట్రోల్ చేయటానికి టాస్క్ బార్ లో వున్న సౌండ్ ఐకాన్ ను మౌస్ తో క్లిక్ చేస్తాము.కానీ ఈ ఐకాన్ ను క్లిక్ చేసి మనము వాల్యూం ను తగ్గించటం లేదా పెంచటం చేస్తే ఆ ఎఫెక్ట్ అన్ని అప్లికేషన్స్ మరియు సిస్టం సౌండ్స్ మీద పడుతుంది.కానీ ఒక్కోసారి మనకు మనం యూజ్ చేసే అప్లికేషన్ యొక్క వాల్యూం తక్కువ ఫ్రీక్వెన్సీ లో వినపడాలి అని కోరుకుంటాము.కానీ అది ఎలాగో కొంతమందికి తెలియదు.

మీరు ప్రతి అప్లికేషన్ కు సెపెరేట్ గా సౌండ్ ను తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు.దీనికి మీరు ఈ క్రింది విధం గా చేయండి.

మొదటగా మీరు మీ కంప్యూటర్ లో టాస్క్ బార్ లో వున్న వాల్యూం icon మీద రైట్ క్లిక్ ఇవ్వండి.ఇప్పుడు మీరు Open Volume Mixer అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి.
తరువాత మీరు మీ సిస్టం సౌండ్స్ తో పాటు మీరు యూజ్ చేస్తున్న ప్రతి అప్లికేషన్ యొక్క వాల్యూం ను సెపెరేట్ గా కంట్రోల్ చెయ్యొచ్చు.


Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా ఆండ్రాయిడ్ మరియు విండోస్ పరంగా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

Post a Comment

0 Comments