అతి పెద్ద టెలికాం దిగ్గజాలు అయిన ఎయిర్టెల్ ,ఐడియా మరియు ఇతర సంస్థలతో పాటు ముందుకు దూసుకువెళ్తున్న టెలికాం సంస్థ Jio. ఈ సంస్థ తెచ్చే ప్రతి ఆఫర్ లేదా డివైస్ లు మిగతా ఇండస్ట్రీ లకు గట్టి పోటీని ఇస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే Opera Mini,Chrome ,UC browser లాగానే ఒక లైట్ వెయిట్ బ్రౌసర్ JioBrowser - Fast, Lite & Indian Language support ను క్రొత్తగా లాంచ్ చేసింది.ఇంగ్లీష్ తో పాటు తెలుగు మరియు అనేక భాషలను ఈ బ్రౌసర్ సపోర్ట్ చెయ్యటం ఒక చెప్పుకోదగ్గ విషయం.
ఈ ఫీచర్ ఒక్కటే కాకుండా దీనిలో ప్రైవేట్ గా బ్రౌసింగ్ చేసుకోవటానికి ఉపయోగపడే Incognito mode కూడా పొందుపరిచారు.దీనిలో మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసినప్పుడు మొత్తం అప్లికేషన్ లో న్యూస్ మరియు ఇతర కంటెంట్ మొత్తం మీరు సెలెక్ట్ చేసిన లాంగ్వేజ్ లోకి మారుతాయి.అలాగే దీనిలో ఫాంట్ సైజు ను చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా వుంది.అలాగే మీరు హోమ్ పేజీ లో సెర్చ్ బార్ దగ్గర వున్న మైక్ ను ప్రెస్ చేసి గూగుల్ వాయిస్ సెర్చ్ ను ఉపయోగించుకుని మీరు వెబ్ సెర్చ్ ను చెయ్యవచ్చు.మీరు ఈ బ్రౌసర్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఈ అప్లికేషన్ సైజు దాదాపు 4.8 MB ఉంటుంది మరియు ఆండ్రాయిడ్ వర్షన్ 5.0 మరియు ఆ పైన వున్న ఆండ్రాయిడ్ డివైస్ లలో ఇది పనిచేస్తుంది.చూడాలి ఈ బ్రౌసర్ ఎంత ప్రజాదరణ పొందుతుందో..!


Note: మీకు ఇలాంటి పోస్ట్ లు డైరెక్ట్ గా మీ వాట్సాప్ కి రావాలి అంటే ఈ లింక్ ద్వారా మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.లేదా ఈ లింక్ ద్వారా మా ఫేస్ బుక్ పేజీ ను లైక్ చేసి ఫాలో అవ్వండి


Post a Comment

సరిక్రొత్తది పాతది