Latest

Monday, January 7, 2019

Java, C మరియు HTML మొదలయిన ప్రోగ్రామ్స్ ను ఆండ్రాయిడ్ ఫోన్ లో రన్ చెయ్యటం ఎలా?

How to Run Java ,C and Other Programs on your Android Mobile in Telugu

Image Licence: Creative Commons

ప్రతి కంప్యూటర్ విద్యార్థి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లను నేర్చుకోవటం తప్పనిసరి.ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లను నేర్చుకోవటానికి తప్పని సరిగా ఇన్స్టిట్యూట్ కి వెళ్లి Computer లో నేర్చుకోవాలి.

మనము నేర్చుకున్నది ఏదయినా ప్రాక్టీస్ చెయ్యకపోతే అది మనకు సరిగ్గా రాదు అని తెలిసిందే.కాబట్టి మనము ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ను కూడా సొంతం గా ప్రాక్టీస్ చేసుకోవాలి.

కానీ వీటిని మనము మన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలంటే మనకు కంప్యూటర్ కావాలి మరియు  కంప్యూటర్ లో కొన్ని టూల్స్ కూడా ఇన్స్టాల్  ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది.


ఇదంతా కాకుండా మీ దగ్గర వున్న ఆండ్రాయిడ్ మొబైల్ మరియు ఇంటర్నెట్ సహకారం తో మీరు C,Java,HTML మరియు Python మొదలయిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ను ఒక Android అప్లికేషన్ ద్వారా రన్ చేసుకోవచ్చు...

దీనికి ప్లే స్టోర్ లో  Dcoder, Compiler IDE :Code & Programming on mobile అనే ఒక మంచి Application వుంది.మీరు దీనిని మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ను సెలెక్ట్ చేసుకుని రన్ చేసుకోవచ్చు.దీనికి కేవలం మీ దగ్గర  ఇంటర్నెట్ మరియు ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు.

పైన చెప్పిన యాప్ మాదిరిగానే ప్లే స్టోర్ లో నేను ట్రై చేసిన ఇంకో Online Compiler (Beta) అనే యాప్ కూడా వుంది దీని ద్వారా కూడా మీరు C,Java,HTML లాంటి ప్రోగ్రామ్స్ ను ఆండ్రాయిడ్ మొబైల్ లో రన్ చేసుకోవచ్చు.


Also Read: BSNL మరియు Airtel వినియోగదారులు ఇలా ఫ్రీ గా డేటా ను పొందండి ..!

Also Read: కంప్యూటర్ లో ఎటువంటి అప్లికేషన్ లేకుండా VPN ను సెట్ చేసుకోవటం ఎలా?


Note: మీకు ఇలాంటి పోస్ట్ లు డైరెక్ట్ గా మీ వాట్సాప్ కి రావాలి అంటే ఈ లింక్ ద్వారా మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.లేదా ఈ లింక్ ద్వారా మా ఫేస్ బుక్ పేజీ ను లైక్ చేసి ఫాలో అవ్వండి.
.

No comments:

Post a Comment