త్వరలో వాట్సాప్ లో క్రొత్త ఫీచర్: మీ వాట్సాప్ కు మరింత భద్రత!

WhatsApp Application may soon get Fingerprint Authentication Feature

 Image Source: WABetaInfo

వాట్సాప్ సంస్థ తన మెసెంజర్ లో చాలా మంచి ఫీచర్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తుంది.యూజర్స్ యొక్క అభిరుచులకు తగ్గట్టుగా మరిన్ని ఫీచర్స్ ను వాట్సాప్ తీసుకువచ్చే ప్రయత్నంలో వుంది.

ఈ నేపథ్యం లో వాట్సాప్ లో త్వరలో ఒక సెక్యూరిటీ ఫీచర్ ను వాట్సాప్ సంస్థ తీసుకురానున్నట్లు WABetaInfo ఒక ట్వీట్ లో చెప్పింది.

ఈ సెక్యూరిటీ ఫీచర్ వల్ల మీరు వాట్సాప్ కి Fingerprint లాక్ ను మీ ఫోన్ కు వున్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని వుపయోగించి పెట్టుకోవచ్చు.దీని వళ్ల మీ వాట్సాప్ లోకి ఇతరులు తొంగిచూడటం  సాధ్యపడదు.ఇది సరిగ్గా యాప్ లాక్ మాదిరిగా పనిచేస్తుంది.

ఈ ఫీచర్ ను మీరు మీ WhatsApp సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీ మెనూ లోని అథంటికేషన్  విభాగం లో ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకుని మీ ఫింగర్ ప్రింట్ ను రిజిస్టర్ చేసుకోవటం ద్వారా access చేసుకోవచ్చు.

కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే  మీరు మొత్తం వాట్సాప్ అప్లికేషన్ కి మాత్రమే ఈ Fingerprint lock ను పెట్టుకోగలరు. మీకు నచ్చిన Conversation కు ప్రత్యేకం గా Fingerprint ను పెట్టుకోవటం సాధ్యపడదు.

ఈ ఫీచర్ ప్రస్తుతం ఇంకా development స్టేజి లో వుంది.WABetaInfo ప్రకారం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ Marshmallow మరియు క్రొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్  సిస్టమ్స్ లో ,iOS లో అందుబాటులోకి వస్తుంది అని తెలుస్తుంది.

Also Read: మీరు Jio ఫోన్ వాడుతున్నారా? అయితే మీకో శుభవార్త..!

Note: మీకు ఇలాంటి పోస్ట్ లు డైరెక్ట్ గా మీ వాట్సాప్ కి రావాలి అంటే ఈ లింక్ ద్వారా మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.లేదా ఈ లింక్ ద్వారా మా ఫేస్ బుక్ పేజీ ను లైక్ చేసి ఫాలో అవ్వండి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు