వాట్సాప్ లో గ్రూప్ కాల్స్ చేసుకోవడం ఎలా? వాట్సాప్ లో క్రొత్త ఫీచర్..!

whatsapp icon

Google Play Store లోని అన్ని కమ్యూనికేషన్ అప్లికేషన్ లలో ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ చాలా ఫేమస్ అయిన అప్లికేషన్.ఇప్పుడు ఈ వాట్సాప్ కు ఒక పెద్ద మరియు అందరూ కోరుకునే అప్డేట్ వచ్చింది.అదే గ్రూప్ కాలింగ్.అంటే మీరు వాట్సాప్ గ్రూప్ లో వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ చేసి ఒకేసారి దాదాపు ముగ్గురు మెంబెర్స్ తో మాట్లాడవచ్చు.అంటే మీతో కలిపి నలుగురు అన్నమాట.ఈ ఫీచర్ గురించి ఈ బ్లాగ్ లో ఇంతకుముందే వాట్సాప్ లో రానున్న 5 అద్భుతమయిన ఫీచర్స్ ఇవే..! అనే ఆర్టికల్ లో చెప్పుకోవటం గమనార్హం.

ఈ ఫీచర్ ను మీరు పొందాలి అంటే మీరు వాట్సాప్ ను Google Play Store కు వెళ్లి వాట్సాప్ 2.19.17 వెర్షన్ కు అప్డేట్ చేసుకోండి.మీరు మీ వాట్సాప్ ను అప్డేట్ చేసుకున్న తరువాత మీకు కావలసిన గ్రూప్ లోకి వెళ్లి వాట్సాప్ చాట్ విండో లో పై భాగం లో కుడి ప్రక్కన ఒక టెలిఫోన్ సింబల్ కనపడుతుంది మీరు దానిని టాప్ చెయ్యండి.తరువాత మీరు కాల్ చెయ్యాలి అని అనుకున్న వారి ని సెలెక్ట్ చేసుకోండి.


group calling whatsapp icongroup calling whatsapp icon

తరువాత మీరు వీడియో ఐకాన్ ని లేదా కాలింగ్ ఐకాన్ పై ప్రెస్ చెయ్యండి.ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన కాంటాక్ట్స్ కు మీరు సెలెక్ట్  చేసుకున్న దానిని బట్టి వీడియో లేదా వాయిస్ కాల్ వెళ్తుంది.Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా ఆండ్రాయిడ్ మరియు విండోస్ పరంగా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.Post a Comment

0 Comments