Latest

"Genius is one percent inspiration, ninety-nine percent perspiration"--Thomas Edison

Monday, January 21, 2019

యూట్యూబ్ వీడియో లను యాడ్స్ లేకుండా ప్లే చెయ్యటం ఎలా?

How to Play YouTube Videos Without Ads


ప్రస్తుత కాలంలో యూట్యూబ్ గురించి తెలియని వారు చాలా తక్కువ మంది వుంటారు.చాలా  మంది తమ వృత్తి కోసం ,కొంతమంది Entertainment కోసం ,మరికొంతమంది క్రొత్త వాటిని నేర్చుకోవటం కోసం ,ఇలా చాలా మంది అనేక రకాలుగా యూట్యూబ్ ను ఉపయోగిస్తున్నారు.కానీ యూట్యూబ్ లో మనము ఏదయినా వీడియోను ప్లే చేసినప్పుడు వీడియో లో యాడ్స్ ప్లే అవ్వడం గమనించవచ్చు.ఈ యాడ్స్ ప్లే అవ్వటం వల్ల మనకు కొంత Concentration దెబ్బతింటుంది.

యాడ్స్ ప్లే అవ్వకుండా ఉండటానికి  కొన్ని అప్లికేషన్స్ మరియు Extensions వున్నాయి.కానీ ఎటువంటి అప్లికేషన్స్ ను ఉపయోగించకుండా మీరు మీకు నచ్చిన యూట్యూబ్ వీడియో ను ఎటువంటి యాడ్స్ లేకుండా చూడటం ఎలాగో నేను మీరు ఈ ఆర్టికల్ లో చెప్తాను.


  • మొదటగా మీరు యూట్యూబ్ కి వెళ్లి మీకు కావలసిన వీడియో ను ఎంచుకుని దాని యొక్క URL ను కాపీ చేసుకోండి.
NOTE: మీరు కంప్యూటర్ లో యూట్యూబ్ వీడియో ను ప్లే  చెయ్యగానే మీకు బ్రౌజర్ అడ్రస్ బార్ లో URL కనపడుతుంది.దానిని కాపీ చెయ్యండి.మీరు ఒకవేళ మొబైల్ లో యూట్యూబ్ అప్లికేషన్ వాడుతుంటే మీరు మీకు కావలసిన వీడియో ను ప్లే చేసి వీడియో పై భాగం లో షేర్ ఐకాన్ పై క్లిక్ చేసి లేదా టైటిల్ క్రింద వున్న షేర్ ఐకాన్ పై క్లిక్ చేసి Copy link అనే ఆప్షన్ ను ప్రెస్ చెయ్యటం ద్వారా వీడియో URL ను కాపీ చేసుకోవచ్చు.



share button youtube
youtube copylink




  •  ఇప్పుడు ఈ వెబ్సైటు ( https://www.viewpure.com ) కు వెళ్లి , ఆ వెబ్సైటు లో వున్న టెక్స్ట్ బాక్స్ లో మీరు కాపీ చేసిన URL ను పేస్ట్ చేసి Purify అనే దానిపై క్లిక్ చేయండి.

viewpure website sample

  • ఇప్పుడు మీరు మీ వీడియో ను ఎటువంటి యాడ్స్ లేకుండా వీక్షించవచ్చు.పైన తెలిపిన వెబ్సైటు ను Bookmark గా చేసుకోవటం వళ్ళ మీరు ఈ వెబ్సైటు ను ఈజీ గా యాక్సిస్  చేసుకోవచ్చు.

Also Read: యూట్యూబ్ లో డార్క్ మోడ్ ను ఎనేబుల్ చేయటం ఎలా?

Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.


No comments:

Post a Comment