మీరు కాపీ చేసిన టెక్స్ట్ ఫోన్ ను రీబూట్ చేయగానే డిలీట్ అయిపోతుందా? అయితే ఇలా చెయ్యండి!

Best Clipboard Application For Android


మనము ఆండ్రాయిడ్ ఫోన్ లో ఒక్కొక్కసారి ఇంటర్నెట్ నుండి లేదా వేరే ప్రదేశం నుంచి ఒక టెక్స్ట్ ను కాపీ చేసుకుని దానిని ఇంకొక ప్రదేశం లో పేస్ట్ చేసుకుంటూ ఉంటాము.కానీ మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు ఒకేసారి కేవలం ఒక టెక్స్ట్ ను మాత్రమే కాపీ చేసుకుని పేస్ట్ చెయ్యాల్సి ఉంటుంది.

ఇలా కాకుండా మీరు కాపీ చేసిన ప్రతి టెక్స్ట్ ఒక చోట స్టోర్ అయ్యి దానిని మీకు నచ్చినప్పుడు, నచ్చిన చోట పేస్ట్ చేసుకోగలిగితే..! మరియు మీరు కాపీ చేసిన టెక్స్ట్ మీరు ఫోన్ ను రీబూట్ చేసినా కూడా డెలీట్ అవ్వకపోతే..! చాలా ఉపయోగకరంగా ఉంటుంది కదా..!?

కానీ ఇది ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ప్లే స్టోర్ లో లభించే ఈ Clipboard Manager, Notes, use Clipto Pro అనే అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోండి.దీని ద్వారా మీరు కాపీ చేసిన ప్రతి టెక్స్ట్ ఈ అప్లికేషన్ లో  స్టోర్ అవుతుంది.తద్వారా మీరు మీ ఫోన్ ను రీబూట్ చేసినా కూడా మీరు కాపీ చేసిన టెక్స్ట్ అనేది డెలీట్ అవ్వదు.అలానే మీరు వివిధ టెక్స్ట్ లను కాపీ చేసుకుని భవిష్యత్తు లో ఉపయోగించుకోవచ్చు.

మీరు ఈ అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసాక అప్లికేషన్ ఫై భాగం లో ఒక toggle ఉంటుంది.మీరు దానిని ఆన్ చెయ్యండి.తరువాత మీ ఆండ్రాయిడ్ లో మీరు కాపీ చేసిన ప్రతి టెక్స్ట్ ఈ అప్లికేషన్ లోకి వస్తుంది.మీరు మీకు కావలసినప్పుడు ఈ అప్లికేషన్ లో వున్న టెక్స్ట్ ను టాప్ చెయ్యడం ద్వారా టెక్స్ట్ ను కాపీ  చేసుకోవచ్చు.



మీరు ఈ అప్లికేషన్ లో వున్న టెక్స్ట్ పైన లాంగ్ ప్రెస్ చేసి Delete సింబల్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ను డిలీట్ చేసుకోవచ్చు.దీనిలో ఇంకా చాలా ఉపయోగకరమయిన ఆప్షన్స్  ఎన్నో వున్నాయి.


Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు