ఆండ్రాయిడ్ ఫోన్ లో చాలా మంది ప్రతిసారి వాల్ పేపర్ ను చేంజ్ చేస్తూ వుంటారు.అవును.. వాల్ పేపర్ వల్ల మన ఫోన్ యొక్క లుక్ మారిపోతుంది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు.! ఇప్పుడు ఫోన్స్ ఎక్కువ రిసొల్యూషన్ తో రావడం వల్ల తక్కువ క్లారిటీ కలిగిన ఫొటోస్ ను వాల్ పేపర్ గా సెట్ చెయ్యటం వల్ల వాల్ పేపర్ బ్లర్ అవుతుంది.

దీని కొరకు గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు మనకు ఎక్కువగా HD పిక్చర్స్ రావడం కష్టం.మరి మనకు HD క్లారిటీ కలిగిన వాల్ పేపర్లు ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటున్నారా? అయితే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో లభించే Wallpapers and Backgrounds అప్లికేషన్ ను ఒక సారి ట్రై చేసి చూడండి.దీనిలో ఎన్నో రకాల వాల్ పేపర్స్ అదీ HD క్లారిటీ తో లభిస్తున్నాయి.


మీరు మీకు నచ్చిన వాల్ పేపర్ ను మీకు నచ్చిన క్లారిటీ తో డౌన్లోడ్  చేసుకుని డైరెక్ట్ గా మీ ఫోన్ కు వాల్ పేపర్ గా అప్లై చేసుకోవచ్చు.


అంతే కాకుండా మీరు వాల్ పేపర్ కు రియల్ టైం లో కొన్ని రకాల ఫోటో ఎఫెక్ట్స్ ను కూడా అప్లై చేసుకోవచ్చు.ప్లే స్టోర్ లో వున్న అన్ని అప్లికేషన్స్ లో ఈ అప్లికేషన్ ను ది బెస్ట్ గా చెప్పుకోవచ్చు...!


Also Read: వాట్సాప్ లో గ్రూప్ కాల్స్ చేసుకోవడం ఎలా? వాట్సాప్ లో క్రొత్త ఫీచర్..!


Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

Post a Comment

సరిక్రొత్తది పాతది