ఫేస్ బుక్ లో పొరపాటున పంపిన మెసేజ్ ను డిలీట్ చెయ్యాలి అని అనుకుంటున్నారా? అయితే ఇలా చెయ్యండి!

How to Unsend Messages On Facebook

మనము ఒక్కొక్కసారి పొరపాటున మెసేజ్ ను తప్పుగా పంపుతాము లేదా మనము పంపాలి అనుకున్న వారికి కాకుండా వేరే వారికి మెసేజ్ పంపే సందర్భాలు లేకపోలేవు.కాని ఒకసారి మనము మెసేజ్ పంపిన తరువాత దాన్ని డిలీట్ చేయ్యటం అసాధ్యం మరియు డిలీట్ చేసినా  కూడా అది మన వరకే డెలీట్ అవుతుంది.ఈ మధ్యనే వాట్సాప్ లో మనము కొన్ని నిమిషాల వ్యవధిలో మన మెసేజ్ ను పూర్తిగా డిలీట్ చేసుకునే ఆప్షన్ వచ్చింది.కాని ఫేస్ బుక్ లో ఇటువంటి సదుపాయం ఇప్పటి వరకు లేదు.కాని ,క్రొత్తగా ఫేస్ బుక్ కూడా ఈ సదుపాయాన్ని తెచ్చింది.దీని ద్వారా ఫేస్ బుక్ లో మీరు పంపిన మెసేజ్ ను 10 నిమిషాల వ్యవధిలో పూర్తిగా డిలీట్ చేసుకునే అవకాశం వుంది.ఇది ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.


  • మొదటగా మీరు ప్లే స్టోర్ కి వెళ్లి Facebook మెసెంజర్ ను లేటెస్ట్ వెర్షన్ కు అప్డేట్ చేసుకోండి.
  • తరువాత మీరు ఎప్పుడు అయినా పొరపాటున మెసేజ్ ను తప్పుగా పంపితే వెంటనే మీరు పంపిన మెసేజ్ పైన ఫింగర్ తో లాంగ్ ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు Remove అనే ఆప్షన్ మీద ప్రెస్ చెయ్యండి.తరువాత Remove for everyone అనే ఆప్షన్ మీద ప్రెస్ చెయ్యండి.ఇప్పుడు మరలా REMOVE అనే దాని పైన క్లిక్ చెయ్యగానే మీరు పంపిన మెసేజ్ పూర్తిగా డిలీట్ అయిపోతుంది.

How to Unsend Messages On Facebook
Step:1
How to Unsend Messages On Facebook
Step:3
How to Unsend Messages On Facebook
Step:2



మీరు ఒక వేల కంప్యూటర్ లో ఫేస్ బుక్ వాడుతుంటే మౌస్ కర్సర్ ను మీరు పంపిన మెసేజ్ మీదకు తీసుకురండి.తరువాత అక్కడ కనిపించే three dot symbol పై క్లిక్ చేసి Remove అనే దానిపై క్లిక్ చెయ్యండి.ఇప్పుడు మీకు ఒక pop up box వస్తుంది.దానిలో Remove for everyone అని సెలెక్ట్ చేసి Remove అనే దానిపై క్లిక్ చెయ్యండి.


How to Unsend Messages On Facebook
Facebook Unsend On Desktop UI

ఈ విధం గా మీరు పంపిన మెసేజ్ ను 10 నిమిషాల లోపు డెలీట్ చేసుకునే సదుపాయాన్ని ఫేస్ బుక్ కల్పించింది.దీని ద్వారా వినియోగదారులు చాలా అపార్దాల నుండి తప్పించుకోవచ్చు.


Also Read: మిమ్మల్ని కంపెనీ కాల్స్ బాగా ఇబ్బంది పెడుతున్నాయా?అయితే ఇలా చేయండి..!


Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 


Post a Comment

0 Comments