Latest

"Genius is one percent inspiration, ninety-nine percent perspiration"--Thomas Edison

Sunday, March 3, 2019

ఫేస్ బుక్ మెసెంజర్ లో డార్క్ మోడ్ ను ఎనేబుల్ చెయ్యటం ఎలా?

How to Enable Dark Mode on Facebook Messenger

దాదాపు అన్ని అప్లికేషన్స్ లలో ఈ మధ్య డార్క్ మోడ్ అనే ఫీచర్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నారు.సాధారణంగా మనము ఒక అప్లికేషన్ ను యూజ్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే కాంతి ద్వారా చాలా ఒత్తిడి కలిగే ప్రమాదం వుంది.కానీ ఈ డార్క్ మోడ్ ద్వారా అప్లికేషన్ UI కి డార్క్ థీమ్ అప్లై అవుతుంది తద్వారా యూజర్స్ తమ కళ్ళకు కలిగే వత్తిడిని కొంతమేరా తగ్గించుకోవచ్చు.ఎట్టకేలకు ఈ డార్క్ మోడ్ ఫేస్ బుక్ మెసెంజర్ కు కూడా వచ్చేసింది.దీనిని మీ ఫేస్ బుక్ మెసెంజర్ లో ఎలా ఆక్టివేట్ చెయ్యాలో ఈ క్రింద చూడవచ్చు.


  • మొదటగా మీరు మీ ఫేస్ బుక్ మెసెంజర్ ను ప్లే స్టోర్ కి వెళ్లి అప్డేట్ చేసుకోండి.
  • తరువాత ఫేస్ బుక్ మెసెంజర్ ను ఓపెన్ చేసి ఏదో ఒక conversation లోకి వెళ్ళండి.
  • ఇప్పుడు మీరు మెసేజ్ ను compose చేసే ప్రదేశం లో వున్న smiley ఫేస్ ను క్లిక్ చేసి  మీ ఫ్రెండ్ కి ఈ క్రింద చూపించబడిన మూన్ emoji ను Send చెయ్యండి.



  • వెంటనే మీకు స్క్రీన్ మీద ఒక Animation వస్తుంది.ఆ animation అయిపోయిన తరువాత "You found dark mode " ఒక పాప్ అప్ వస్తుంది.
  • మీరు అక్కడ వున్న TURN ON IN SETTINGS అనే దానిపై టాప్ చెయ్యగానే మీరు సెట్టింగ్స్ వెళతారు.
  • ఇప్పుడు మీరు Dark Mode ఆప్షన్ ను toggle ను జరిపి టర్న్ ఆన్ గాని లేదా టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు.

enable dark mode facebook messenger


మీరు మొదటసారి ప్రయత్నించినప్పుడు ఈ డార్క్ మోడ్ ఆప్షన్ పనిచేయకపోతే మీరు ఒకసారి ఫేస్ బుక్ మెసెంజర్ ను ఫోర్స్ స్టాప్ చేసి మరలా పైన చెప్పిన ప్రాసెస్ ను ఫాలో అవ్వండి.


Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 



No comments:

Post a Comment