Translate

3, ఏప్రిల్ 2019, బుధవారం

ఇంస్టాగ్రామ్ లో మీరు గతం లో లైక్ చేసిన పోస్ట్ లను చూడటం ఎలా?

How to See Previously Liked Posts On Instagram?



Instagram లో మనము ఫేస్ బుక్ లో లాగానే ఎన్నో ఫోటో లను మరియు వీడియో లను షేర్ చేసుకుంటాము అలానే లైక్ చేస్తుంటాము.ఫేస్ బుక్ లో అయితే మనము గతం లో లైక్ చేసిన పోస్ట్ లను Activity Log ద్వారా తెలుసుకోవచ్చు.


అలానే Instagram లో కూడా మీరు గతంలో like చేసిన పోస్ట్ లను చూసుకోవచ్చు.కాని దీనికి Instagram లో వేరే విధానం వుంది.ఇది కొంత మందికి తెలీదు.కావున ,నేను అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు instagram లో గతం లో లైక్ చేసిన పోస్ట్ లను ఎలా తెలుసుకోవాలో ఈ క్రింద చెప్పడం జరిగింది.

మీరు ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇంస్టాగ్రామ్ అప్లికేషన్ ను ఓపెన్ చేసి అప్లికేషన్ మెయిన్ ఇంటర్ఫేస్ లో క్రింది భాగం లో వున్న ప్రొఫైల్ ఐకాన్ ని క్లిక్ చెయ్యండి.


తరువాత అప్లికేషన్ పై భాగం లో కుడి పక్కన కనిపిస్తున్న hamburger symbol ను క్లిక్ చేసి సెట్టింగ్స్ ను ఓపెన్ చెయ్యండి.




ఇప్పుడు Account అనే దాని మీద క్లిక్ చేసి Posts you've liked అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి.

ఇప్పుడు మీరు గతం లో లైక్ చేసిన పోస్ట్ లు దర్శనమిస్తాయి.
                   

     


Note: మీరు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టెక్నాలజీ న్యూస్ మరియు ఆండ్రాయిడ్, కంప్యూటర్ టిప్స్ డైరెక్ట్ గా టెలిగ్రామ్ లో పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 



వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి