వెబ్ పేజీ మొత్తాన్ని ఒకేసారి స్క్రీన్ షాట్ తీసుకునేందుకు అద్భుతమయిన గూగుల్ క్రోమ్ Extension

How to take a screenshot of a whole Web page in Google Chrome


Best Google Chrome Extension For Taking Full Web Page Screen Shot In Telugu


మనకు ఒక్కొక్కసారి మొత్తం వెబ్ పేజీ ను స్క్రీన్ షాట్ తీసుకునే అవసరం ఏర్పడుతుంది.కానీ స్క్రీన్ షాట్ ల విషయానికి వస్తే మనము ఎక్కువ శాతము visible ఏరియా ను మాత్రమే కాప్చర్ చేయగలము.

కానీ ఒకవేళ మనకు మొత్తం పేజీ ను కాప్చర్ చేసే అవసరం వస్తే ఏమి చెయ్యాలి..? మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అనుకుంటున్నారా..

అయితే మీరు Awesome Screenshot: Screen Video Recorder 
అనే గూగుల్ క్రోమ్ Extension ను ఉపయోగించాల్సిందే..! ఈ గూగుల్ క్రోమ్ Extension  ద్వారా మీరు వెబ్ పేజీ ను మొత్తాన్ని ఒకేసారి స్క్రీన్ షాట్ తీసుకుని ఇమేజ్ రూపంలో లేదా PDF రూపంలో మీ కంప్యూటర్ లో సేవ్ చేసుకోవచ్చు.


Chrome Web Store వున్న వాటన్నింటిలో ఈ Extension పేరుకు తగ్గట్టుగా Awesome గా పనిచేస్తుంది మరియు బెటర్ result ను యిస్తుంది. మీరు ఈ గూగుల్ క్రోమ్ Extension ను ఎలా ఉపయోగించాలో ఈ క్రింద వివరంగా చదవవచ్చు.


  • తరువాత అక్కడ వున్న Add to Chrome అనే దాని మీద క్లిక్ చేసి మీరు దానిని మీ క్రోమ్ బ్రౌజర్ కు యాడ్ చేసుకోండి.
  • ఇప్పుడు మీ క్రోమ్ యొక్క అడ్రస్ బార్ కు కుడి వైపున ఈ క్రింది విధం గా ఒక ఐకాన్ కనపడుతుంది.

Best Google Chrome Extension For Taking Full Web Page Screen Shot

  • తరువాత మీరు స్క్రీన్ షాట్ తియ్యాలి అని అనుకున్న వెబ్సైటు కు వెళ్లి ఈ ఐకాన్ పై మౌస్ తో లెఫ్ట్ క్లిక్ యిచ్చి capture entire page అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.
  • వెంటనే వెబ్ పేజీ మొత్తం ఒకసారిగా స్క్రోల్ అయ్యి మీరు వేరే Tab కి వెళ్తారు.అక్కడ మీరు తీసిన స్క్రీన్ షాట్ కనపడుతుంది.మీరు స్క్రీన్ షాట్ కు ఏమయినా Editing చెయ్యాలి అని అనుకుంటే అక్కడ కనిపిస్తున్న టూల్స్ ను సెలెక్ట్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు.మీ ఎడిటింగ్ పూర్తి అయిన తర్వాత DONE మీద క్లిక్ చెయ్యండి.


Best Google Chrome Extension For Taking Full Web Page Screen Shot

  • తరువాత మీకు ఈ క్రింది విధంగా కనపడుతుంది.మీరు స్క్రీన్ షాట్ ను ఇమేజ్ రూపంలో పొందాలి అని అనుకుంటే మొదట ఐకాన్ పై క్లిక్ చేయండి లేదా PDF రూపంలో పొందాలి అని అనుకుంటే రెండవ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి.తరువాత మీరు స్క్రీన్ షాట్ ను మీ కంప్యూటర్ లో కి సేవ్ చేసుకోవచ్చు.


Best Google Chrome Extension For Taking Full Web Page Screen Shot In Telugu




ఈ విధంగా మీరు ఈ Extension తో మీకు నచ్చిన వెబ్ పేజీ ను మొత్తాన్ని ఒకేసారి ఈజీ గా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.ఈ extension లో ఈ ఒక్క ఫీచర్ మాత్రమే కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ కూడా వున్నాయి.


This is all about How to take a screenshot of a whole Web page in chrome.


Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 



వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు