Translate

9, మే 2019, గురువారం

ఆండ్రాయిడ్ లో గూగుల్ క్రోమ్ నోటిఫికేషన్స్ ను డిసేబుల్ చెయ్యటం ఎలా?

How to Stop Notifications From Certain Websites On Google Chrome For Android

మనము ఆండ్రాయిడ్  లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను వుపయోగించి ఇంటర్నెట్ ను బ్రౌజ్ చేసేటప్పుడు చాలా వెబ్సైట్ లను visit చేస్తాము.వీటిలో కొన్ని వెబ్సైట్స్ నోటిఫికేషన్స్ ను Allow చెయ్యమని అడుగుతాయి.ఒకవేళ మనము నోటిఫికేషన్స్ ను Allow చేస్తే మనకు ఆ వెబ్సైటు నుంచి నోటిఫికేషన్స్ వస్తుంటాయి.

కానీ ఒక్కొక్కసారి మనము కంగారులో Allow బటన్ ను మనకు యిష్టం లేకపోయినా కూడా ప్రెస్ చేస్తుంటాము.

ఇలా చేసినప్పుడు ఈ Notifications ను ఎలా disable చేసుకోవచ్చో మనము ఈ క్రింద చూద్దాం.

మొదటగా మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో గూగుల్ క్రోమ్ ను ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ కుడి ప్రక్కన పై భాగం లో వున్న three dot symbol పై క్లిక్ చెయ్యండి.తరువాత Settings మీద క్లిక్ చెయ్యండి.

How to Stop Notifications From Certain Websites On Google Chrome For Android



ఇప్పుడు Advanced విభాగం లో వున్న Site settings అనే దానిపై క్లిక్ చెయ్యండి.


                                                     How to Stop Notifications From Certain Websites On Google Chrome For Android



తరువాత Notifications అనే దానిపై క్లిక్ చెయ్యండి.

How to Stop Notifications From Certain Websites On Google Chrome For Android


తరువాత మీరు గూగుల్ క్రోమ్ లో నోటిఫికేషన్స్ ను కంప్లీట్ గా Disable చెయ్యాలి అని అనుకుంటే Notifications అనే దగ్గర వున్న Slider ను ఆఫ్ చెయ్యండి.

మీరు కేవలం కొన్ని వెబ్సైట్స్ కు మాత్రమే నోటిఫికేషన్స్ ను బ్లాక్ చెయ్యాలి అని అనుకుంటే  Allowed అనే దగ్గర మీరు నోటిఫికేషన్స్ ను Allow చేసిన Websites కనపడతాయి.


                                              How to Stop Notifications From Certain Websites On Google Chrome For Android



ఇప్పుడు మీరు నోటిఫికేషన్స్ ను బ్లాక్ చేయాలి అని అనుకున్న వెబ్సైటు మీద క్లిక్ చెయ్యండి తరువాత Notifications అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి Block అనే దానిని సెలెక్ట్ చెయ్యండి.


How to Stop Notifications From Certain Websites On Google Chrome For AndroidHow to Stop Notifications From Certain Websites On Google Chrome For Android


ఈ విధంగా మీరు ఆండ్రాయిడ్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో నోటిఫికేషన్స్ ను Block చేసుకోవచ్చు.


Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.

మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి