ఫేస్ బుక్ లో వీడియోలు ఆటోమేటిక్ గా ప్లే అవుతున్నాయా? అయితే ఇలా చెయ్యండి

How to Turn Off Facebook Video Autoplay On Android and PC in Telugu


మనము ఫేస్ బుక్ లో ఫొటోస్ తో పాటు వీడియోలను కూడా షేర్ చేసుకోవచ్చు అని తెలిసిందే.
మీరు ఫేస్ బుక్ అప్లికేషన్ ను ఉపయోగిస్తున్నప్పుడు కానీ లేదా కంప్యూటర్ లో ఫేస్ బుక్ ను ఓపెన్ చేసినప్పుడు గాని వీడియోలు ఆటోమాటిక్ గా ప్లే అవ్వటం మీరు గమనించే వుంటారు.ఇలా ఆటోమేటిక్ గా ప్లే అవ్వటం వల్ల చాలా మంది అసహనానికి గురి అవుతారు.

ఇలా ఆటో మాటిక్ గా వీడియోలు ప్లే అవ్వటం వల్ల నిజంగానే చాలా చిరాకు గా అనిపిస్తుంది.
ఒకవేల వీడియో లు సౌండ్ తో పాటు గా ఆటోమాటిక్ గా ప్లే అయితే ఇంకా మనకు కోపం అధికమవుతుంది.కానీ మీరు ఏమి ఆందోళన చెందనవసరం లేదు.

ఎందుకంటే నేను ఈ పోస్ట్ లో ఫేస్ బుక్ లో వీడియోలను ఆటోమేటిక్ గా ప్లే అవ్వకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలో వివరంగా చెప్తాను.మీరు చెయ్యవలిసినది ఈ క్రింది స్టెప్స్ ను జాగ్రత్తగా ఫాలో అవ్వటమే..!


Procedure :


Android:
  • ముందుగా మీరు ఆండ్రాయిడ్ మొబైల్ లో ఫేస్ బుక్ అప్లికేషన్ ను ఓపెన్ చెయ్యండి.తరువాత అప్లికేషన్ పై భాగం లో కుడి ప్రక్కన కనిపిస్తున్న hamburger ఐకాన్ పై టాప్ చేసి Settings & Privacy అనే ఆప్షన్ పై క్లిక్ చేసి Settings అనే దానిపై క్లిక్ చెయ్యండి.
  • ఇప్పుడు settings పేజీ ను ను స్క్రోల్ చేసి Media and Contacts పై క్లిక్ చెయ్యండి.
              
               
How to Turn Off Facebook Video Autoplay On Android and PC in Telugu
             

How to Turn Off Facebook Video Autoplay On Android and PC in Telugu


  • ఇప్పుడు మరలా పేజీ ను స్క్రోల్ చేసి Autoplay అనే దాని మీద క్లిక్ చేసి Never Autoplay Videos అనే దానిని టాప్ చేసి సెలెక్ట్ చేసుకోండి.


   How to Turn Off Facebook Video Autoplay On Android and PC in Telugu

How to Turn Off Facebook Video Autoplay On Android and PC in Telugu


Computer:

  • ముందుగా మీరు కంప్యూటర్ లో గూగుల్ క్రోమ్ ను ఓపెన్ చేసి మీ ఫేస్ బుక్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.
  • తరువాత ఈ క్రింద చూపించబడిన డ్రాప్ డౌన్ ఐకాన్ ను క్లిక్ చేసి Settings ను ఓపెన్ చెయ్యండి.



How to Turn Off Facebook Video Autoplay On Android and PC in Telugu



  • తరువాత  ఎడమ ప్రక్కన లిస్ట్ లో వున్న Videos అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి 
  • ఇప్పుడు ఈ క్రింద చూపించిన విధంగా Auto play videos అనే ఆప్షన్ దగ్గర వున్న బాక్స్ పై క్లిక్ చేసి off అనే దానిని సెలెక్ట్ చేసుకోండి.



How to Turn Off Facebook Video Autoplay On Android and PC in Telugu


ఈ విధంగా మీరు ఫేస్ బుక్ లో ఆటోమేటిక్ గా ప్లే అయ్యే వీడియోస్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.



Also Read: PUBG మొబైల్ లోని వివిధ మెడల్స్ మరియు వాటి అర్ధాలు 2019



Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.

మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 

Post a Comment

0 Comments