Latest

"Genius is one percent inspiration, ninety-nine percent perspiration"--Thomas Edison

Tuesday, May 14, 2019

ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను పర్మినెంట్ గా డిలీట్ చెయ్యటం ఎలా?

How to Delete Instagram Account permanently?


ఆధునిక యువత కమ్యూనికేషన్ కోసం మరియు Entertainment కోసం అనేక రకాల సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ను ఉపయోగిస్తుంది.దీనిలో ఫేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్ లు ప్రజాదరణ పొందినవి.వీటిలో ఫోటో,వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అయిన ఇంస్టాగ్రామ్ ను చాలా మంది ఉపయోగిస్తున్నారు.ఒక్కొక్కసారి ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ నుంచి పూర్తిగా వైదొలగాలని అనిపిస్తుంది.దీనికి చాలా కారణాలు ఉండవచ్చు.ఏది ఏమయినా చాలా రకాల సోషల్ మీడియా నెట్వర్క్స్ ఈ ఫెసిలిటీ ను కల్పిస్తున్నాయి.


ఇంస్టాగ్రామ్ లో కూడా మీ అకౌంట్ ను పూర్తిగా డెలీట్ చేసుకునే ఫెసిలిటీ వుంది.మీరు మీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను పూర్తిగా డిలీట్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవ్వండి.

మీరు ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను పూర్తిగా డిలీట్ చేసుకోకుండా టెంపరరీ గా కూడా Disable చేసుకోవచ్చు.మీరు ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను టెంపరరీ గా ఎలా Disable చేసుకోవచ్చో ఇక్కడ నుంచి చదవవచ్చు.



Note: మీరు Instagram అకౌంట్ ను టెంపరరీ గా Disable చేసుకుంటే మీ ప్రొఫైల్ , comments మరియు లైక్స్ ఎవరికీ కనపడవు.మీరు మరలా మీ ఇంస్టాగ్రామ్ లోకి లాగిన్ అవ్వగానే మీ ప్రొఫైల్ తిరిగి Activate అవుతుంది.మీరు మీ అకౌంట్ ను permanent గా డిలీట్ చేసుకుంటే మీ అకౌంట్ మరలా రికవరీ అవ్వకపోవచ్చు.


Procedure:

  • ముందుగా మీరు ఏదయినా బ్రౌజర్ నుంచి instagram.com లోకి వెళ్లి మీరు డిలీట్ చేయాలి అని అనుకున్న instagram అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.


  • మీకు Save Your Login Info అనే ఒక పేజీ వస్తే మీరు సింపుల్ గా Not Now మీద క్లిక్ చెయ్యండి.
  • ఇప్పుడు మీరు ఈ అడ్రస్ https://www.instagram.com/accounts/remove/request/permanent ను కాపీ చేసుకుని మీరు ఇందాక instagram ఎకౌంటు లోకి లాగిన్ అయిన బ్రౌజర్ అడ్రస్ బార్ లో పేస్టు చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చెయ్యండి.మీకు ఒక  పేజి ఈ క్రింది మాదిరిగా ఓపెన్ అవుతుంది.



  • తరువాత Why are you deleting your account? అనే చోట వున్న బాక్స్ మీద క్లిక్ చేసి ఏదో ఒక రీజన్ ను సెలెక్ట్ చేసుకోండి లేదా something else మీద క్లిక్ చెయ్యండి.
  • తరువాత మీరు To continue,please re-enter your password అనే దగ్గర వున్న బాక్స్ లో మీ ఇంస్టాగ్రామ్ పాస్వర్డ్ ను ఎంటర్ చెయ్యండి.ఇప్పుడు Permanently delete my account మీద క్లిక్ చెయ్యండి.
  • మిమ్మల్ని ఇంస్టాగ్రామ్ Are you sure you want to delete your account? అని అడుగుతుంది.మీరు OK లేదా confirm బటన్ పై క్లిక్ చేయగానే మీ అకౌంట్ డెలీట్ అయిపోతుంది.



Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 

No comments:

Post a Comment