Translate

14, మే 2019, మంగళవారం

ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను టెంపరరీ గా Disable చెయ్యటం ఎలా?

How to Temporarily Disable Instagram Account in Telugu?


ఆధునిక యువత కమ్యూనికేషన్ కోసం మరియు Entertainment కోసం అనేక రకాల సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ను ఉపయోగిస్తుంది.దీనిలో ఫేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్ లు ప్రజాదరణ పొందినవి.వీటిలో ఫోటో,వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అయిన ఇంస్టాగ్రామ్ ను చాలా మంది ఉపయోగిస్తున్నారు.ఒక్కొక్కసారి ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ నుంచి పూర్తిగా వైదొలగాలని అనిపిస్తుంది.దీనికి చాలా కారణాలు ఉండవచ్చు.ఏది ఏమయినా చాలా రకాల సోషల్ మీడియా నెట్వర్క్స్ ఈ ఫెసిలిటీ ను కల్పిస్తున్నాయి.


ఇంస్టాగ్రామ్ లో కూడా మీరు మీ అకౌంట్ ను పూర్తిగా డెలీట్ చేసుకోవచ్చు లేదా మీరు మీ అకౌంట్ ను టెంపరరీ గా Disable చేసుకోవచ్చు.మీరు మీ అకౌంట్ ను permanent గా డిలీట్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి మీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను permanent గా ఎలా డిలీట్ చెయ్యాలో తెలుసుకోండి. మీరు టెంపరరీ గా మీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను Disable చేసుకోవాలి అని అనుకుంటే ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవ్వండి.

Note: మీరు మీ అకౌంట్ ను టెంపరరీ గా Disable చేసుకుంటే మీ ప్రొఫైల్ , comments మరియు లైక్స్ ఎవరికీ కనపడవు.మీరు మరలా మీ ఇంస్టాగ్రామ్ లోకి లాగిన్ అవ్వగానే మీ ప్రొఫైల్ తిరిగి Activate అవుతుంది.మీరు మీ అకౌంట్ ను permanent గా డిలీట్ చేసుకుంటే మీ అకౌంట్ మరలా రికవరీ అవ్వకపోవచ్చు.


Procedure:

  • ముందుగా మీరు ఏదయినా బ్రౌజర్ నుంచి instagram.com లోకి వెళ్లి మీరు డిలీట్ చేయాలి అని అనుకున్న instagram అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.

  • మీకు Save Your Login Info అనే ఒక పేజీ వస్తే మీరు సింపుల్ గా Not Now మీద క్లిక్ చెయ్యండి.
  • తరువాత మీరు ఈ అడ్రస్  https://www.instagram.com/accounts/remove/request/temporary ను కాపీ చేసుకుని ఇందాక ఇంస్టాగ్రామ్ అకౌంట్ లోకి లాగిన్  అయిన బ్రౌజర్ యొక్క అడ్రస్ బార్ లో పేస్ట్ చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చెయ్యండి.
  • ఇప్పుడు మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మీరు Why are you disabling your account? అనే చోట వున్న బాక్స్ పై క్లిక్ చేసి మీరు ఎదో ఒక reason ను ఇవ్వండి లేదా something else ను ఎంచుకోండి.
  • తరువాత To continue, please re-enter your password అనే చోట వున్న బాక్స్ లో మీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ password ను టైపు చేసి Temporarily Disable Account అనే దాని మీద క్లిక్ చెయ్యండి.



  • ఇప్పుడు స్క్రీన్ మీద ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ ఒకటి వస్తుంది మీరు సింపుల్ గా OK లేదా Confirm మీద క్లిక్ చెయ్యగానే మీ అకౌంట్ Disable అవుతుంది.

మీరు మీ అకౌంట్ ను తిరిగి ఆక్టివేట్ చేసుకోవాలి అని భావిస్తే మీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లోకి లాగిన్ అయితే సరిపోతుంది.


Also Read: WhatsApp for Android will get Sticker Notifications,Dark Mode soon

Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి