PUBG Mobile లో Spectator Mode ను డిసేబుల్ చెయ్యటం ఎలా?

How to Disable Spectator Mode in PUBG Mobile



How to Disable Spectator Mode in PUBG Mobile



మొబైల్ గేమింగ్ ప్రపంచం లో PUBG Mobile ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు.ఈ గేమ్ ను ఎక్కువగా ఆడుతున్నందువల్ల కొన్ని ప్రాంతాలలో ఈ గేమ్ ను బాన్ చేసారు అంటే దీని కున్న క్రేజ్ మనకు అర్ధం అవుతుంది.

ఇది ఇలాగు ఉంటే PUBG Mobile కూడా ఎప్పటికప్పుడు gamers కు క్రొత్త ఫీచర్స్ ను తెస్తుంది.ఈ నేపథ్యం లోనే కొన్ని రోజుల క్రితం వచ్చిన PUBG 0.12.0 అప్డేట్ లో Spectator Mode వచ్చింది.

ఈ ఫీచర్ డిఫాల్ట్ గా ఎనేబుల్ లో ఉంటుంది.ఈ ఫీచర్ ఎనేబుల్ లో ఉండటం వల్ల మన గేమ్ ను మన ఫ్రెండ్స్ lobby లో వుండి కూడా లైవ్ లో చూడవచ్చు.అంటే spectate చెయ్యవచ్చు.

కానీ నేను గమనించిన దాని ప్రకారం ఈ విధంగా spectate చేయబడటం కొంతమందికి యిష్టం ఉండదు.దీనికి కారణం తెలియనప్పటికీ PUBG Mobile దీనికి ప్రత్యామ్నాయం గా ఈ Mode ను ఆఫ్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది.

ఇప్పుడు మనము దీనిని ఎలా ఆఫ్ చేయవచ్చో తెలుసుకుందాం.


Procedure:


  • మొదటగా మీ మొబైల్ లో PUBG గేమ్ ను ఓపెన్ చెయ్యండి.
  • తరువాత ఈ క్రింది చూపించబడిన  గేర్ ఐకాన్ పై క్లిక్ చేసి సెట్టింగ్స్ కు వెళ్ళండి.

How to Disable Spectator Mode in PUBG Mobile

  • ఇప్పుడు Basic అనే ట్యాబు ను ప్రెస్ చెయ్యండి.
  • తరువాత పేజీ ను స్క్రోల్ చేసి Allow Spectators అనే దానికి ఎదురుగా వున్న Disable అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.
How to Disable Spectator Mode in PUBG Mobile

ఇలా చెయ్యటం వల్ల మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ lobby లో నుంచి spectate చెయ్యటం కుదరదు.



Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.

మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

Post a Comment

0 Comments