Translate

4, మే 2019, శనివారం

ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ ను ఎటువంటి అప్లికేషన్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవటం ఎలా?

How to download Instagram Profile Picture Without Any Application In Telugu 


ఫేస్ బుక్ మరియు ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లతో పోల్చుకుంటే Instagram అనేది ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది.Instagram కూడా యూజర్స్ యొక్క ప్రైవసీ ను దృష్టిలో ఉంచుకుని వివిధ సెక్యూరిటీ మరియు ప్రైవసీ ఫీచర్స్ ను తన అప్లికేషన్ లో పొందుపరిచింది.మన ఫ్రెండ్స్ యొక్క ప్రొఫైల్ పిక్చర్స్ ను డౌన్లోడ్ చేసుకోలేకపోవటం  మరియు ఇంస్టాగ్రామ్ నుండి ఫోటో,వీడియో లను డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోలేకపోవడం వంటివి దీనికి ఉదాహరణలు.


ప్లే స్టోర్ లోని కొన్ని రకాల థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా లేదా ఇంటర్నెట్ లోని కొన్ని వెబ్సైట్ ద్వారా మీరు Instagram లో ని వీడియోస్ మరియు ఫోటో లను ఈజీ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.యిది ఎలాగో మీరు ఇక్కడ నుంచి చదవవచ్చు.

ఇంస్టాగ్రామ్ లో మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే ఇంకో విషయం ఏమిటంటే మీరు యితరుల ప్రొఫైల్ పిక్చర్ లను డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోలేరు.కానీ ఇప్పుడు ఈ పోస్ట్ లో మీరు ఎటువంటి అప్లికేషన్స్ ను ఉపయోగించకుండా మీ Friends యొక్క ప్రొఫైల్ పిక్చర్ ను చూడటం మరియు డౌన్లోడ్ చేసుకోవటం ఎలాగో చూద్దాం. 


  • మొదటగా మీరు బ్రౌజర్ ను ఓపెన్ చేసి బ్రౌజర్ యొక్క సెర్చ్ బార్ లో instadp.com అని టైపు చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చెయ్యండి.తర్వాత అక్కడ పేజీ లో కనిపిస్తున్న Search username అన్న చోట మీరు ఎవరి ప్రొఫైల్ పిక్చర్ ను అయితే డౌన్లోడ్ చెయ్యాలి అని అనుకున్నారో వారి యొక్క ఇంస్టాగ్రామ్ Username ను ఎంటర్ చెయ్యండి.
How to download Instagram Profile Picture Without Any Applications In Telugu
  • మీరు username ను ఎంటర్ చెయ్యగానే మీరు ఎంటర్ చేసిన యూజర్ ప్రొఫైల్ రియల్ టైం లో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది.మీరు దానిపై క్లిక్ చెయ్యండి. 

How to download Instagram Profile Picture Without Any Application In Telugu

  • ఇప్ప్పుడు మీరు ఎంటర్ చేసిన యూజర్ యొక్క ప్రొఫైల్ పిక్చర్ చూపించబడుతుంది.మీరు ఆ ఫోటో క్రింద వున్న Download అనే దానిపై క్లిక్ చెయ్యండి.
[ఒక వేల పేజీ లో advertisements వచ్చినట్లయితే మీరు కొన్ని సెకండ్స్ తరువాత Skip Ad మీద క్లిక్ చెయ్యండి]
How to download Instagram Profile Picture Without Any Applications In Telugu
  •  తరువాత ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేసి లేదా కంప్యూటర్ లో అయితే మౌస్ తో రైట్ క్లిక్ యిచ్చి Image ను మీ కంప్యూటర్ లోకి లేదా మొబైల్ లోకి సేవ్ చేసుకోవచ్చు.
How to download Instagram Profile Picture Without Any Applications In Telugu


Note: This post is for education purposes only.


Note: మీరు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టెక్నాలజీ న్యూస్ మరియు ఆండ్రాయిడ్, కంప్యూటర్ టిప్స్ డైరెక్ట్ గా  వాట్సాప్ కి పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి