Translate

17, మే 2019, శుక్రవారం

PUBG మొబైల్ లోని వివిధ మెడల్స్ మరియు వాటి అర్ధాలు 2019

PUBG Mobile Medals List And Their Meanings in Telugu



PUBG Mobile Medals List And Their Meanings in Telugu


ఈ మధ్య కాలంలో  PUBGPLAYERUNKNOWN'S BATTLEGROUNDS ) గేమ్ తెలియని వారు చాలా తక్కువ.PUBG గేమ్ ను మొబైల్ లో మరియు PC లోనూ ఆడేవారి సంఖ్య రోజు రోజు కు పెరుగుతుంది.దీనికి కారణం PUBG గేమ్ లోని graphics ,communication ,adventure మరియు మొదలయిన కారణాలతో పాటు కొన్నిటెలికాం సంస్థలు తెచ్చిన unlimited డేటా ప్లాన్స్ కూడా ఈ PUBG గేమ్ Addiction కు దారితీస్తున్నాయి.


ఏది ఏమయినా కూడా PUBG మొబైల్ లో మీరు ఎలా ఆడినా సరే లాస్ట్ లో మీకు మీ ర్యాంకింగ్ తో పాటు కొన్ని మెడల్స్ రావటం మీరు గమనించే వుంటారు.చాలా మందికి ఈ మెడల్స్ యొక్క అర్థాలు తెలీవు.ఈ మెడల్స్ మీరు గేమ్ లో చేసిన వివిధ ఆక్టివిటీ ల మీద ఆధారపడి ఉంటాయి.


అయితే ఇప్పుడు PUBG మొబైల్ లో వుండే వివిధ మెడల్స్ మరియు వాటి వివరాలు గురించి తెలుసుకుందాం.


Lifesaver : మీరు గేమ్ లో మూడు కంటే ఎక్కువ సార్లు Revive లు ఇచ్చినట్లయితే మీకు ఈ మెడల్ వస్తుంది.


Skyfall : ప్లేయర్ కనుక Redzone లో చనిపోతే ఈ మెడల్ వస్తుంది.


Helpless :  గేమ్ లో ప్లేయర్ 3 కంటే ఎక్కువ సార్లు knocked out అయితే ఈ మెడల్ వస్తుంది.

Too soon : పారాచూట్ నుంచి land అయినప్పటి నుంచి 3 నిమిషాల లోపే ప్లేయర్ చనిపోతే ఈ మెడల్ వస్తుంది.


Flying Fish ఎత్తయిన ప్రదేశం నుంచి నీటిలోకి 2 కంటే ఎక్కువ సార్లు పడితే ప్లేయర్ కు ఈ మెడల్ వస్తుంది.


Finisher :  బాగా గాయ పడ్డ శత్రువును ప్లేయర్ కనుక చంపినట్లయితే ప్లేయర్ కు ఈ మెడల్ వస్తుంది.(మొదటగా గాయపరిచిన వారు మీ టీం వారు కాకూడదు).


Couch Potato :  ప్లేయర్ ముందుగా చనిపోయి మరియు ప్లేయర్ టీమ్ కనుక ఎక్కువ రేటింగ్ ను పొందినట్లయితే ప్లేయర్ కు ఈ మెడల్ యిస్తారు.


Suicide Squad ప్లేయర్ కనుక తన ఇష్టానుసారం లేదా పొరపాటున తనను తాను చంపుకుంటే ఈ మెడల్ వస్తుంది.


Scavenger : ప్లేయర్ రెండు కంటే ఎక్కువ ఎయిర్ డ్రాప్స్ ను Loot చేసినట్లయితే ఈ మెడల్ ను సంపాదించుకోవచ్చు.


Prone to Prone :ప్లేయర్ కనుక గేమ్ లో ఎక్కువ సేపు prone లోనే ఉంటే ఈ మెడల్ వస్తుంది. 


Armour Expert గేమ్ లో ప్లేయర్ కనుక లెవెల్ 3 armour,backpack మరియు vest ను కలిగి ఉంటే ఈ మెడల్ వస్తుంది.


Berserker ప్లేయర్ 800 కంటే ఎక్కువ డామేజీ,3 కంటే ఎక్కువ కిల్స్ మరియు గేమ్ లో దాదాపు 20 నిమిషాలు కంటే ఎక్కువ సమయం సర్వైవ్ అయి ఉంటే ఈ మెడల్ పొందవచ్చు.


Chicken Master ప్లేయర్ 5 కంటే ఎక్కువ మందిని చంపి మ్యాచ్ ను గెలిస్తే ఈ మెడల్ ను పొందవచ్చు.


Fight Club : ప్లేయర్ కనుక punch ల ద్వారా 2 కంటే ఎక్కువ కిల్స్ చేస్తే ఈ మెడల్ ను పొందవచ్చు.


Golden Boy ప్లేయర్ ఎటువంటి Damage చెయ్యకుండా మరియు ఎటువంటి Damage పొందకుండా మ్యాచ్ ను గెలిస్తే ఈ మెడల్ పొందవచ్చు.


Medic :  ఒక ప్లేయర్ గేమ్ మొత్తం లో 500+ హెల్త్ ను రికవర్ చేసుకుంటే ఈ మెడల్ వస్తుంది.


Nugget Dinner ప్లేయర్ కేవలం 5 కంటే తక్కువ మందిని చంపి గేమ్ ను గెలిచినట్లయితే ఈ మెడల్ వస్తుంది.


Road Rage ప్లేయర్ 2 కంటే ఎక్కువ కిల్స్ ను వెహికల్ ద్వారా పొందితే ఈ మెడల్ వస్తుంది.


Sir Miss a Lot గేమ్ లో ప్లేయర్ చాలా ఎక్కువ షాట్స్ ను మిస్ చేసినట్లయితే ఈ  మెడల్ పొందుతాడు.


Terminator ( Gold ) ప్లేయర్ 10 మంది కంటే ఎక్కువ శత్రువులను చంపితే ఈ మెడల్ వస్తుంది.


Terminator ప్లేయర్ కనుక గేమ్ లో చివరి శత్రువుని చంపి మొదటి రాంక్ ను సంపాదిస్తే ఈ మెడల్ వస్తుంది.


Wabbit Hunter షార్ట్ గన్ తో ప్లేయర్ 2 కంటే ఎక్కువ కిల్స్ చేస్తే ఈ మెడల్ రావటానికి అవకాశం వుంది.


Grenadier ప్లేయర్ కు కనుక 2 కంటే ఎక్కువ కిల్స్ గ్రెనేడ్ ద్వారా వస్తే ఈ మెడల్ వస్తుంది.


Marathon man : గేమ్ లో ప్లేయర్ కనుక 1000 కంటే ఎక్కువ మీటర్స్ ను కాలినడక తో ట్రావెల్ చేస్తే ఈ మెడల్ వచ్చే అవకాశం ఉంటుంది.


Masochrist : గేమ్ లో ప్లేయర్ తన యొక్క గ్రెనైడ్ ద్వారా తానే damage పొందినట్లయితే ఈ మెడల్ పొందవచ్చు.


Gunslinger: ప్లేయర్ కు గేమ్ లో 7-10 కిల్స్ వస్తే ఈ మెడల్ వస్తుంది.


Survivalist : ప్లేయర్ కనుక గేమ్ లో 25 నిమిషాల కంటే ఎక్కువ సేపు సర్వైవ్ అయ్యి తక్కువ damge మరియు కిల్స్ ను పొందితే ఈ మెడల్ ను పొందవచ్చు.


Head hunter : ప్లేయర్ 2 కంటే ఎక్కువ మంది శత్రువులని హెడ్ షాట్స్ ద్వారా చంపితే ఈ మెడల్ ను పొందవచ్చు.



ఇలా PUBG మొబైల్ లో ప్లేయర్స్ తమ యొక్క performance ను బట్టి మరియు వివిధ టాస్క్ లను బట్టి గేమ్ లాస్ట్ లో వివిధ మెడల్స్ ను పొందుతారు.



Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి