అప్లికేషన్స్ ను అప్డేట్ చేసుకోవటం అవసరమా? అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది?

Is it essential to Update Applications? What happens if you don't? in Telugu



Is it essential to Update Applications? What happens if you don't? In Telugu

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా లేదా యితర ఆపరేటింగ్ సిస్టం వాడినా కూడా మీరు కొన్ని అప్లికేషన్స్ కు దగ్గర UPDATE అనే దానిని చూసే వుంటారు లేదా అప్లికేషన్స్ ను ఉపయోగిస్తున్నప్పుడు New Update Available  అనే మెసేజ్ ను మీరు గమనించే వుంటారు.అయితే కొంతమంది దీనిని పట్టించుకుంటారు కొంత మంది పట్టించుకోరు.


ఇలా అప్లికేషన్స్ కు లేదా ఆపరేటింగ్ సిస్టమ్స్ కు అప్డేట్స్ ఎందుకు వస్తాయి? మనము అప్డేట్ ఎందుకు చెయ్యాలి ? అప్డేట్ చెయ్యకపోతే ఏమి అవుతుంది అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి.ఇప్పుడు మనము వీటికి సమాధానాలు తెలుసుకుందాం.



అప్లికేషన్స్ కు ఎందుకు అప్డేట్స్ వస్తాయి?

మీరు ఏ ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నా కూడా అప్లికేషన్స్ కు లేదా సిస్టం కు అప్డేట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి.ఇలా అప్లికేషన్స్ కు లేదా సిస్టం కు అప్డేట్స్ రావడానికి ఎక్కువగా మూడు కారణాలు ఉంటాయి.అవి ఏంటంటే...



సెక్యూరిటీ : రోజూ టెక్నాలజీ కి సంబంధించి ఎన్నో రకాల వైరస్ లు పుట్టుకు వస్తున్నాయి.ఇలాంటి వైరస్ లను తట్టుకోవటానికి అప్లికేషన్స్ కు పటిష్టమైన సెక్యూరిటీ వ్యవస్థ కావాలి.కాబట్టి అప్లికేషన్స్ డెవలపర్ లు ఎప్పటికప్పుడు ఈ మాల్వేర్ లను ఎదురించటానికి అప్లికేషన్స్ కు సెక్యూరిటీ patch లను అప్డేట్స్ రూపం లో అందిస్తారు.మీరు కనుక ఈ అప్డేట్స్ ను ఇన్స్టాల్ చేసుకుంటే మీ ఆపరేటింగ్ సిస్టం కొంతమేర సేఫ్ గా ఉంటుంది.


బగ్స్ : అప్లికేషన్స్ ను డెవలప్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వున్నా కూడా ఎదో ఒక mistake చెయ్యటం జరుగుతుంది.వీటి వల్ల Software లలో కొన్ని defects ఏర్పడతాయి.వీటిని టెక్నికల్ భాషలో బగ్స్ అని అంటారు.ఈ బగ్స్ ను సరిచేసి డెవలపర్ లు మరలా Software ను అప్డేట్ రూపంలో యూజర్స్ కు పంపుతారు.



ఫీచర్స్ : రోజు రోజు కి డెవలప్ అవుతున్న టెక్నాలజీ లో నెగ్గుకురావాలి అంటే అప్లికేషన్స్ లో ప్రత్యేకమయిన మరియు ఉపయోగకరమయిన ఆప్షన్స్ ను ఇంట్రడ్యూస్ చెయ్యటం చాలా ముఖ్యం.కాబట్టి అప్లికేషన్ డెవలపర్స్ లేదా మొబైల్ కంపెనీ సంస్థలు ఎప్పటికప్పుడు క్రొత్త ఫీచర్స్ ను అప్డేట్ రూపంలో యూజర్స్ కు పంపుతాయి.యూజర్స్ అప్లికేషన్ ను అప్డేట్ చేసుకోవడం వల్ల ఈ క్రొత్త ఫీచర్స్ ను వినియోగించుకోవచ్చు.


ఇవే కాకుండా అప్లికేషన్ ను ఇంప్రూవ్ చేయుటకు ,స్టెబిలిటీ ను పెంచటానికి కూడా డెవలపర్ లు తమ అప్లికేషన్స్ ను అప్డేట్ చేస్తూ వుంటారు.


అప్డేట్ ఎందుకు చేసుకోవాలి ?

ఈ ప్రశ్నకు సమాధానం పైన చెప్పిన సమాధానంలోనే వుంది.అంటే మీరు Adware,Spyware మరియు వైరస్ లు లాంటి Malware ల నుండి రక్షణ పొందాలి అంటే అప్లికేషన్స్ ను అలాగే సిస్టం ను Up to date గా ఉంచుకోవాలి.ఇలా అప్డేట్ చేసుకోవటం వల్ల పూర్తిగా కాకయినా కూడా కొంతవరకు మీరు ఆన్లైన్ ఎటాక్ ల నుంచి రక్షణ పొందవచ్చు.అలాగే డెవలపర్ లు విడుదల చేసే క్రొత్త అప్డేట్ ను యూజ్ చెయ్యాలి అన్నా,అప్లికేషన్స్ స్టేబుల్ గా ఉండాలి అన్నా కూడా అప్లికేషన్స్ ను అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి.



అప్లికేషన్స్ ను అప్డేట్  చేసుకోకపోతే ఏమి అవుతుంది ?

మీరు కనుక అప్లికేషన్స్ లేదా సిస్టం అప్డేట్స్ ను ఇన్స్టాల్ చేసుకోకపోతే డెవలపర్ లు డెవలప్ చేసిన క్రొత్త ఫీచర్స్ ను, Software ను స్టేబుల్ గా ఉంచటానికి మరియు బగ్స్ ను ఫిక్స్ చెయ్యటానికి డెవలపర్ లు చేసిన క్రొత్త మార్పులను మీరు పొందలేరు.అలానే మీరు కనుక నెట్వర్క్ తో కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నట్లు అయితే మీరు ఆన్లైన్ లో జరిగే మాల్వేర్ Attacks కు ఎక్కువగా గురి అయ్యే ప్రమాదం వుంది.


ఇలా మీరు అప్లికేషన్స్ ను అప్డేట్ చేసుకోవడం ద్వారా క్రొత్త Features ను పొందటం మాత్రమే కాకుండా సెక్యూరిటీ పరంగా కూడా మీరు చాలా బెనిఫిట్స్ ను పొందుతారు.ఒకవేల మీరు మొబైల్ డేటా ను ఉపయోగిస్తుంటే మీరు ముఖ్యమయిన అప్లికేషన్స్ అనగా మొబైల్ వాలెట్ లు ,బ్రౌజర్ లు,బ్యాంకు అప్లికేషన్స్ వంటి సున్నితమయిన డేటా ను కలిగి వుండే అప్లికేషన్స్ ను మొదటగా అప్డేట్ చేసుకుని మిగిలిన వాటిని వైఫై తో కనెక్ట్ అయినప్పుడు అప్డేట్ చేసుకుంటే మీరు మరియు మీ పర్సనల్ డేటా కొంత వరకు సేఫ్టీ గా ఉంటుంది.



Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

Post a Comment

0 Comments