ప్రతి విండోస్ యూజర్ తప్పకుండా తెలుసుకోవలసిన టాప్ 15 రన్ కమాండ్స్

Top 15 Run Commands Every Windows User Should Know in Telugu



విండోస్ ఆపరేటింగ్ సిస్టం లో ఒక ప్రోగ్రాం లేదా ఫోల్డర్ ను ఓపెన్ చెయ్యటానికి అనేక మార్గాలు వున్నాయి.వాటిలో ఒక ఎఫిషియెంట్ మార్గం ఏమిటంటే Run dialogue box ను యూజ్ చెయ్యటం.దీని ద్వారా మనము వివిధ Applications ను మరియు ఫోల్డర్లు ను ఈజీ గా ఓపెన్ చెయ్యవచ్చు.మామూలుగా స్టార్ట్ లోకి వెళ్లి ప్రోగ్రామ్స్ ను ఓపెన్ చేసేకంటే ఈ రన్ డైలాగ్ బాక్స్ ద్వారా మీరు సింపుల్ గా టాస్క్ లను  కంప్లీట్ చేసుకోవచ్చు.ఈ Run dialogue box గురించి కొంతమంది కి తెలిసినా కూడా ఈ Run dialogue box కమాండ్స్ గురించి చాలా మందికి తెలీదు.


సో,ఈ రోజు మనము ఈ రన్ డైలాగ్ బాక్స్ కి సంభందించిన కొన్ని ఉపయోగకరమయిన కమాండ్స్ ను తెలుసుకుందాం.

ముందుగా ఈ రన్ బాక్స్ ను మీ విండోస్ కంప్యూటర్ లో ఓపెన్ చెయ్యాలి అంటే మీరు విండోస్ కీ ను ప్రెస్ చేసి ఉంచి R ను ప్రెస్ చెయ్యాలి ( WINDOWS KEY + R ).


Top 15 Run Commands Every Windows User Should Know in Telugu
WINDOWS KEY+R


ఇప్పుడు మీకు ఈ క్రింది విధంగా ఒక రన్ బాక్స్ ఓపెన్ అవుతుంది.తరువాత మీరు Run dialogue box ఫీల్డ్ లో (Open అనే దానికి ఎదురుగా వున్న బాక్స్ లో) మీకు నచ్చిన కమాండ్ ను టైపు చేసి ఎంటర్ బటన్ క్లిక్ చెయ్యాలి.


Top 15 Run Commands Every Windows User Should Know in Telugu


ఇప్పుడు మనము కొన్ని ఇంపార్టెంట్ రన్ కమాండ్స్ గురించి తెలుసుకుందాం.



Calc

మీరు Windows Key + R ప్రెస్ చేసి రన్ బాక్స్ ఓపెన్ చేసిన తరువాత అక్కడ వుండే field లో సింపుల్ గా calc అని టైపు చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మీ కంప్యూటర్ లో calculator ఓపెన్ అవుతుంది .మీరు స్టార్ట్ మెనూ లోకి వెళ్లి calculator అని సెర్చ్ చేసి ఓపెన్ చేసే కంటే ఈ method ను పాటించటం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది.


cmd 

ఈ కమాండ్ ను వుపయోగించి మీరు Command Prompt ను ఓపెన్ చెయ్యవచ్చు.ఈ Command Prompt ను వుపయోగించి మనము మామూలుగా గ్రాఫికల్ ఇంటర్ఫేస్ లో చెయ్యలేని మరియు చేసే టాస్క్ లను స్పీడ్ గా చెయ్యవచ్చు.


\ (Back Slash)

మీరు ఈజీ గా ఈ రన్ డైలాగ్ బాక్స్ లో \ ను టైపు చేసి ఎంటర్ ప్రెస్ చెయ్యటం వల్ల మీరు డైరెక్ట్ గా  మీ కంప్యూటర్ C డ్రైవ్ లోకి వెళ్తారు.


.. (Double Dots)

మీరు ఈ .. ను రన్ బాక్స్ లో టైపు చేసి ఎంటర్ ను ప్రెస్ చెయ్యగానే మీరు C డ్రైవ్ లో వుండే Users ఫోల్డర్ లోకి వెళ్తారు.


control

మీరు ఈ control అనే కమాండ్ ని యూజ్ చేస్తే మీరు control Panel లోకి వెళ్తారు.ఈ కంట్రోల్ ప్యానల్ ను వుపయోగించి మీరు వివిధ నెట్వర్క్ ,ఈజీ అఫ్ యాక్సిస్ వంటి మొదలయిన సెట్టింగ్స్ ను యాక్సిస్ చెయ్యొచ్చు.


hdwwiz.cpl

ఈ కమాండ్ ను వుపయోగించి మీరు మీ కంప్యూటర్ లో డివైస్ మేనేజర్ ను ఓపెన్ చెయ్యవచ్చు.ఈ డివైస్ మేనేజర్ ద్వారా మీరు మీ కంప్యూటర్ కు ఇంటర్నల్ గా మరియు ఎక్స్టర్నల్ గా కనెక్ట్ అయి వున్న వున్న డివైస్ లను మేనేజ్ చేసుకోవచ్చు.


osk

విండోస్ కీ ను ప్రెస్ చేసి ఉంచి R కీ ను ప్రెస్ చెయ్యగానే ఓపెన్ అయ్యే రన్ బాక్స్ లో మీరు osk అని టైపు చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చెయ్యగానే మీకు On-Screen Keyboard ఓపెన్ అవుతుంది.



msinfo32

మీ కంప్యూటర్ Hardware మరియు Software గురించి మొత్తం వివరంగా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే Windows Key + R ను ప్రెస్ చేసి ఓపెన్ అయ్యే రన్ డైలాగ్ బాక్స్ లో msinfo32 అని టైపు చేసి ఎంటర్ బటన్ పై క్లిక్ చెయ్యండి.మీరు మీ కంప్యూటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.


notepad

విండోస్ లో మనము ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్స్ లో notepad కూడా ఒకటి.మీరు ఈ notepad ను స్టార్ట్ మెనూ లోకి వెళ్లి ఓపెన్ చేసే బదులు డైరెక్ట్ గా రన్ డైలాగ్ బాక్స్ లో notepad అని టైపు చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.



taskmgr

మీరు సాధారణం గా టాస్క్ మేనేజర్ ను ఓపెన్ చెయ్యాలి అంటే ctrl+shift+esc ను ప్రెస్ చేస్తారు.మీరు టాస్క్ మేనేజర్ ను రన్ dialogue బాక్స్ లో taskmgr అని టైపు చేసి ఎంటర్ ప్రెస్ చేసి కూడా ఓపెన్ చేసుకోవచ్చు.


winword.exe

విండోస్ లో మనము ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్ Microsoft Word.దీనిని మనము రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసిన తరువాత winword.exe అనే కమాండ్ ద్వారా ఓపెన్ చెయ్యవచ్చు.


powershell

ఇక మనము కొంచం తక్కువ గా యూజ్ చేసే powershell ను powershell అనే రన్ కమాండ్ ద్వారా ఓపెన్ చెయ్యవచ్చు.


wordpad

ఈ కమాండ్ మీ కంప్యూటర్ లోని wordpad ను ఓపెన్ చేస్తుంది.మీరు Windows Key+R ద్వారా రన్ డైలాగ్ బాక్స్ ను ఓపెన్ చేసిన తర్వాత wordpad అని టైపు చేసి ఎంటర్ బటన్ ని ప్రెస్ చెయ్యగానే మీ కంప్యూటర్ లోని wordpad ఓపెన్ అవుతుంది.


msconfig

ఈ కమాండ్ ద్వారా మీకు  సిస్టం configuration విండో ఓపెన్ అవుతుంది.మీరు ఈ సిస్టం configuration విండో నుంచి బూట్ అప్ ఆప్షన్స్ లాంటి వాటిని access చేసుకోవచ్చు.


snippingtool

స్క్రీన్ షాట్ ను తీసుకోవడానికి ఉపయోగించే Snipping Tool ను ఓపెన్ చెయ్యటానికి ఈ కమాండ్ ను ఉపయోగిస్తారు.Windows Key+R ను ప్రెస్ చేసిన తర్వాత రన్ డైలాగ్ బాక్స్ లో snippingtool అని టైపు చేసి OK పై క్లిక్ చేసి గాని లేదా ఎంటర్ బటన్ ను ప్రెస్ చేసి గాని మీరు ఈ snippingtool ను ఓపెన్ చెయ్యవచ్చు.


ఇవే కాక ఇంకా చాలా రన్ కమాండ్స్ అందుబాటులో వున్నాయి.కానీ పైన పేర్కొన్న కమాండ్స్ మనము తరచుగా ఉపయోగించే ప్రోగ్రామ్స్ మరియు ఫోల్డర్లు ను ఓపెన్ చెయ్యటానికి బాగా ఉపయోగపడతాయి.

Also Read: ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను పర్మినెంట్ గా డిలీట్ చెయ్యటం ఎలా?




Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు