How to Turn Off Notifications For Memories On Facebook?
సోషల్ మీడియా నెట్వర్క్స్ అన్నింటిలో Facebook చాలా ప్రాచుర్యం పొందింది.దీనిలో కేవలం చాటింగ్ మాత్రమే కాకుండా ఎన్నో రకాల ఫీచర్స్ కూడా వున్నాయి.వాటిలో మన ఫ్రెండ్స్ యొక్క Birthdays కి మనకు Notifications రావడం మొదలయినవి ముఖ్యమయినవి.
Facebook లో వున్న ఇంకొక అద్భుతమయిన ఫీచర్ ఏమిటంటే మీరు ఎప్పుడో గత సంవత్సరాలలో అదే రోజు మీరు Facebook లో చేసిన activities ను Notifications రూపంలో పొందవచ్చు.కాని కొంతమందికి కొన్ని కారణాల వల్ల ఈ ఫీచర్ కొంత చిరాకును తెప్పిస్తుంది.
ఈ Notifications ను ఎలా ఆపాలో తెలీక చాలా మంది నిరాశకు గురి అవుతారు.కానీ నిజానికి మీరు ఈ Notifications ను ఆఫ్ చెయ్యవచ్చు.ఈ ప్రాసెస్ ను మీరు ఈ క్రింద విపులం గా చదవవచ్చు.
- మొదటగా మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఫేస్ బుక్ అప్లికేషన్ ను ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో memories అని టైపు చేసి సెర్చ్ చెయ్యండి.సెర్చ్ రిజల్ట్స్ లో మీరు ఈ క్రింది మాదిరిగా ఒక Result ను చూస్తారు.మీరు దానిపైన టాప్ చెయ్యండి.
- ఇప్పుడు మీరు ఈ క్రింద మార్క్ చేసిన సెట్టింగ్స్ సింబల్ ను క్లిక్ చెయ్యండి.
- మీరు సెట్టింగ్స్ సింబల్ ను క్లిక్ చెయ్యగానే మీకు notifications మరియు preferences అని రెండు ఆప్షన్స్ వస్తాయి.
- మీరు ఈ memories ను పూర్తిగా నిలిపివేయాలంటే Notifications అనే దాని మీద క్లిక్ చేసి none అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
- మీరు కేవలం ముఖ్యమయిన memory లను మాత్రమే పొందాలి అని అనుకుంటే Highlights అనే దానిని సెలెక్ట్ చేనుకోండి.
- ఇంక రెండవ ఆప్షన్ కి వస్తే మీరు ఈ Preferences పైన క్లిక్ చెయ్యగానే ఈ క్రింది విధం గా రెండు ఆప్షన్స్ వస్తాయి.

- మీరు ఈ ఆప్షన్స్ లో People అనే దానిని సెలెక్ట్ చేసుకుని మీరు ఎవరి యొక్క మెమోరీస్ ను పొందకూడదు అని అనుకుంటున్నారో వారిని ఎంచుకోవచ్చు.లేదా మీరు Dates అనే దానిని క్లిక్ చేసి ఏ ఏ తేదీల యొక్క మెమోరీస్ ను పొందకూడదు అని అనుకుంటున్నారో కూడా ఎంచుకోవచ్చు.
ఇలా మీరు ఈ ఫేస్ బుక్ లోని మెమోరీస్ కు సంబందించిన నోటిఫికేషన్స్ ను ఆఫ్ చేసుకోవచ్చు లేదా మీకు నచ్చిన విధంగా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.
మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి