ఆండ్రాయిడ్ లో ఒకేసారి ఎక్కువ అప్లికేషన్స్ ను Uninstall చెయ్యటం ఎలా?

How to Uninstall Multiple Apps In Android at Once


How to Uninstall Multiple Apps In Android at Once


ఆండ్రాయిడ్ లో మనము అప్లికేషన్స్ లేదా గేమ్స్ ను డౌన్లోడ్ చెయ్యాలి అంటే వెంటనే ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాము.ప్లే స్టోర్ లో కేవలం డౌన్లోడ్ ఫెసిలిటీ మాత్రమే కాకుండా Google Play Protect వంటి చాలా ఫీచర్స్ వున్నాయి.కానీ ఈ  ఫీచర్స్ చాలా కొద్ది మందికే తెలుసు.వీటిలో నేను ఈ రోజు ప్లే స్టోర్ లో వుండే ఒక అద్భుతమయిన మరియు ఉపయోగకరమయిన ఫీచర్ ను చెప్తాను.


సాధారణంగా ఎక్కువ శాతం ఆండ్రాయిడ్ ఫోన్ లలో ఒకేసారి ఒక అప్లికేషన్ ను మాత్రమే Uninstall చెయ్యగలం.కానీ ఈ ట్రిక్ ద్వారా మీరు ఒకేసారి చాలా అప్లికేషన్స్ ను ఈజీ గా Uninstall చెయ్యొచ్చు. అదీ కూడా ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లేకుండా..!  అవును.. మీరు ప్లే స్టోర్ నుంచి ఒకేసారి Bulk గా అప్లికేషన్స్ ను Uninstall చేసుకోవచ్చు.



  • దీనికి మొదటగా మీరు మీ ఫోన్ లో ప్లే స్టోర్ ను ఓపెన్ చేసి ఈ క్రింద చూపించబడిన hamburger ఐకాన్ ను క్లిక్ చెయ్యండి.

How to Uninstall Multiple Apps In Android at Once

  • తరువాత My apps & games మీద క్లిక్ చెయ్యండి. 

How to Uninstall Multiple Apps In Android at Once


  • ఇప్పుడు INSTALLED అనే దానిపై క్లిక్ చేసి Storage అనే దాని మీద క్లిక్ చెయ్యగానే మీ ఫోన్ లో ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ వరుసగా చూపించబడతాయి.

How to Uninstall Multiple Apps In Android at Once

  • మీరు ఇప్పుడు Uninstall చేయాలి అనుకున్న అప్లికేషన్స్ ను సెలెక్ట్ చేసుకుని FREE UP మీద క్లిక్ చెయ్యండి.

How to Uninstall Multiple Apps In Android at Once

  • తరువాత మీకు ఒక పాప్ అప్ వస్తుంది.
  • మీరు ఆ పాప్ అప్ మీద వున్న FREE UP అనే దానిపై క్లిక్ చెయ్యగానే మీరు సెలెక్ట్ చేసుకున్న Applications ఒకేసారి uninstall అయిపోతాయి.


How to Uninstall Multiple Apps In Android at Once


ఇలా మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ మరియు గేమ్స్ ను ఒకేసారి uninstall చేసుకోవచ్చు.


Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

Post a Comment

2 Comments