Latest

"Genius is one percent inspiration, ninety-nine percent perspiration"--Thomas Edison

Thursday, May 2, 2019

మిమ్మల్ని వాట్సాప్ లో అనవసరమయిన గ్రూప్స్ లో యాడ్ చేస్తున్నారా? అయితే ఇలా చెయ్యండి

How to Prevent Someone From Adding you on WhatsApp Group in Telugu 



వాట్సాప్ ను ఉపయోగించి మనము ఫ్రీ గా ఇతరులతో సంభాషించవచ్చు మరియు ఫోటోలను  వీడియో లను కూడా షేర్ చేసుకోవచ్చు.వాట్సాప్ లో వుండే గ్రూప్స్ ద్వారా మనము ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మందితో మాట్లాడుకోవచ్చు.కానీ ఈ గ్రూప్స్ వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటంటే మీ నెంబర్ తమ కాంటాక్ట్ లిస్ట్ లో వున్న ప్రతి ఒక్కరూ మిమ్మలను వారి గ్రూప్స్ లలో యాడ్ చెయ్యటం సాధ్యమవుతుంది.


ఇలా యాడ్ చేసినప్పుడు మీరు కొంత ఇబ్బంది పడాల్సివస్తుంది.కానీ వాట్సాప్ దీనికి ఒక పరిష్కారం తీసుకువచ్చింది.ఈ ఫీచర్ వల్ల యితరులు మీ నెంబర్ ను గ్రూప్స్ లలో యాడ్ చెయ్యటాన్ని నిరోధించవచ్చు.


ఈ ఫీచర్ ను మీరు యాక్సిస్ చెయ్యాలి అంటే మొదటగా మీ వాట్సాప్ అప్లికేషన్ ను ప్లే స్టోర్ కి వెళ్లి లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ చేసుకోండి.తరువాత వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్ పై భాగం లో వున్న three dot symbol పై క్లిక్ చేసి Settings లోకి వెళ్ళండి.ఇప్పుడు Account మీద క్లిక్ చేసి Privacy అనే దానిపై క్లిక్ చెయ్యండి.


How to Prevent Someone From Adding you on WhatsApp Group in Telugu


How to Prevent Someone From Adding you on WhatsApp Group in Telugu


How to Prevent Someone From Adding you on WhatsApp Group in Telugu

                                                

తరువాత పేజీ ను స్క్రోల్ చేసి Groups అనే దానిపై క్లిక్ చెయ్యండి.

How to Prevent Someone From Adding you on WhatsApp Group in Telugu


తరువాత అక్కడ మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.మీరు Everyone అనే దానిని సెలెక్ట్ చేసుకుంటే మీ నెంబర్ ను యితరులు తమ గ్రూప్స్ లో యాడ్ చెయ్యటానికి అవకాశం ఉంటుంది.

How to Prevent Someone From Adding you on WhatsApp Group in Telugu

My contacts అనే దానిని సెలెక్ట్ చేసుకుంటే కేవలం మీ కాంటాక్ట్స్ లో వున్న వారు మాత్రమే  మీ నెంబర్ ను గ్రూప్ లలో యాడ్ చేసే అవకాశం ఉంటుంది.

Nobody అనే దానిని సెలెక్ట్ చేసుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ గ్రూప్స్ లలో యాడ్ చెయ్యటం సాధ్యం కాదు. సో,ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే మీరు కేవలం ఇన్విటేషన్ లింక్ ద్వారా మాత్రమే గ్రూప్స్ లో జాయిన్ అవ్వగలరు.

కాబట్టి మీరు ఈ ఆప్షన్స్ లో ఏదో ఒకదానిని సెలెక్ట్ చేసుకుని DONE అనే బటన్ మీద ప్రెస్ చెయ్యండి.

ఇలా మీరు మీ నెంబర్ ను గ్రూప్స్ లలో యాడ్ అవ్వకుండా అడ్డుకట్టవెయ్యవచ్చు.ఏది ఏమయినా కూడా వాట్సాప్ తెచ్చిన ఈ ఫీచర్ వలన వాట్సాప్ యూజర్స్ కు చాలా మేలు చేకూరుతుంది.


Note: మీరు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టెక్నాలజీ న్యూస్ మరియు ఆండ్రాయిడ్, కంప్యూటర్ టిప్స్ డైరెక్ట్ గా వాట్సాప్ కి పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 

No comments:

Post a Comment