Latest

"Genius is one percent inspiration, ninety-nine percent perspiration"--Thomas Edison

Sunday, May 12, 2019

WhatsApp లో త్వరలో స్టిక్కర్ notifications ,డార్క్ మోడ్! వివరాలు ఇవి..

WhatsApp Messenger for Android to get Sticker Notifications,Dark Mode Soon

WhatsApp Messenger for Android to get Sticker Notifications,Dark Mode Soon



WhatsApp తన మెసెంజర్ లో చాలా ఫీచర్స్ మరియు ఆప్షన్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తుంది.

ఇంటర్నెట్ లోని కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం వాట్సాప్ తన మెసెంజర్ లో Sticker Notifications ను ఇంట్రడ్యూస్ చేయబోతోంది అని తెలుస్తోంది. Sticker Notifications అనగా మనకు సాధారణంగా ఎవరు అయినా వాట్సాప్ లో message ను పంపితే మన నోటిఫికేషన్ బార్ లో ఒక ప్రివ్యూ కనపడుతుంది. ఈ ప్రివ్యూ లలో ఇప్పటివరకు కేవలం Text మరియు emoji లు మాత్రమే కనపడతాయి.కాని త్వరలో రానున్న అప్డేట్స్ లో ఈ ప్రివ్యూ లు స్టికర్స్ కు కూడా సపోర్ట్ చేస్తాయి అని తెలుస్తుంది.


ఇక Dark Mode విషయానికి వస్తే ఈ మధ్య  WABetaInfo చేసిన టెస్ట్ లో వాట్సాప్ తన మెసెంజర్ లో డార్క్ మోడ్ ను ఇంప్రూవ్ చెయ్యటం ఆపివేసింది అని తెలిసింది.కాని ఈ డార్క్ మోడ్ development ను వాట్సాప్ తిరిగి ప్రారంభించినట్లు WABetaInfo Confirm చేసింది.


వాట్సాప్ మెసెంజర్ లో డెవలపింగ్ లో వున్న ఇంకొక ఫీచర్ ఏమిటంటే in-app Browser.దీని ద్వారా WhatsApp లో మీరు ఓపెన్ చేసిన లింక్ వేరే థర్డ్ పార్టీ బ్రౌజర్స్ లో ఓపెన్ అవ్వకుండా డైరెక్ట్ గా వాట్సాప్ లోనే ఓపెన్ చెయ్యవచ్చు.ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ బీటా వెర్షన్ 2.19.74 లో అందుబాటులో వుంది.


ఒకసారి ఈ మధ్య వాట్సాప్ తెచ్చిన ఫీచర్స్ ను కనుక ఒకసారి పరిశీలిస్తే వాట్సాప్ తెచ్చిన Biometic Authentication ఫీచర్ ద్వారా వాట్సాప్ ను మనము యితర థర్డ్ పార్టీ అప్లికేషన్స్ తో పని లేకుండా లాక్ చెయ్యవచ్చు.దీనిద్వారా యితర వ్యక్తులు వాట్సాప్ ను access చెయ్యకుండా కాపాడుకోవచ్చు.ఈ ఫీచర్ ప్రస్తుతం iPhone లో మరియు ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో  అందుబాటులో వుంది.


ఇక గ్రూప్ ప్రైవసీ ఫీచర్ కి వస్తే సాధారణంగా వాట్సాప్ లో మన నెంబర్ ను సేవ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ మనల్ని వారి గ్రూప్ లలో యాడ్ చెయ్యవచ్చు.కాని దీనికి చెక్ పెడుతూ వాట్సాప్ గ్రూప్ ప్రైవసీ ఫీచర్ ను తీసుకువచ్చింది.దీని ద్వారా ఇతరులు మిమ్మల్ని గ్రూప్ లలో యాడ్ చెయ్యకుండా స్టాప్ చెయ్యవచ్చు.ఇది ఎలాగో మీరు ఇక్కడ నుంచి చదవవచ్చు.



Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.

మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 




No comments:

Post a Comment