ఇప్పుడు మీరు GIF లను డైరెక్ట్ గా Google Images నుండి షేర్ చేసుకోవచ్చు!

Google adds a new way to share GIFs directly to messaging Apps,Social Media


Google adds a new way to share GIFs directly to messaging Apps,Social Media


ఇప్పుడు వున్న పరిస్థితులను బట్టి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ను వాడే వారు చాలా మంది వున్నారు మరియు ఇది రోజు రోజుకూ పెరుగుతుంది. నిజం చెప్పాలి అంటే ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వలన దూర ప్రాంతాలలో వున్న వారితో ఈజీగా కమ్యూనికేషన్ చేసుకోవచ్చు.ఏది ఏమయినా ఈ సోషల్ నెట్వర్కింగ్ వల్ల ఎంత లాభముందో అంత నష్టం కూడా వుంది అని తెలుసుకోవాలి.


ఇక టాపిక్ లోకి వెళ్తే సహజంగా చాటింగ్ చేసే సమయంలో చాలా మంది టెక్స్ట్ తో పాటు వివిధ యిమేజిస్ ,ఎమోజీ మరియు GIF లను పంచుకుంటారు.వినియోగదారులు వారి ఎమోషన్స్,ఫీలింగ్స్ ను కరెక్ట్ గా తెలియచేయటానికి ఈ ఎమోజీ మరియు GIF లను ఉపయోగిస్తారు.


ఈ విషయాన్ని గమనించిన గూగుల్ తన వినియోగదారులకు ఒక ఫీచర్ ను తెచ్చింది.ఇక మీరు డైరెక్ట్ గా గూగుల్ యిమేజిస్ నుండి GIF లను వివిధ ప్లాట్ ఫామ్ లలో షేర్ చేసుకోవచ్చు.ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులు గూగుల్ యాప్ నుంచి లేదా గూగుల్ క్రోమ్ నుంచి యాక్సిస్ చేసుకోవచ్చు.


దీనికి  మీరు చేయవలసినది ఏమిటంటే గూగుల్ క్రోమ్ ను కానీ లేదా గూగుల్ యాప్ ని కానీ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ లో మీకు నచ్చిన GIF పేరును టైపు చేసి స్పేస్ యిచ్చి ప్రక్కన gif అని టైపు చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చెయ్యండి.తరువాత మీరు గూగుల్ సెర్చ్ బార్ క్రింద వున్న ట్యాబు లో IMAGES అనే దానిపై క్లిక్ చెయ్యండి.

ఉదాహరణకు: happy gif అని టైప్ చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేసిన తరువాత IMAGES మీద క్లిక్ చెయ్యగానే మీరు ఎంటర్ చేసిన వర్డ్ కు తగిన GIF లు చూపించబడతాయి.తరువాత మీరు సింపుల్ గా మీకు నచ్చిన GIF కు క్రింది భాగాన వున్న Share అనే దానిపై క్లిక్ చేసి మీకు నచ్చిన platform లో షేర్ చేసుకోవచ్చు.

ఇలా మీరు మీ ఫీలింగ్స్ కు తగిన GIF లను చాటింగ్ సమయంలో ఈజీ గా మీ ఫ్రెండ్స్ మరియు ఆత్మీయులకు షేర్ చేసుకోవచ్చు.

ఈ ఫీచర్ ప్రస్తుతం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ,ఆండ్రాయిడ్ మరియు iOS గూగుల్ అప్లికేషన్స్ లలో పనిచేస్తుంది.ఈ ఫీచర్ మిగిలిన బ్రౌజర్లలో కూడా అందుబాటులోకి రావాలి అని ఆశిద్దాం


Read Also: విండోస్ 10 Calculator ను ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ లో ఉపయోగించుకోవచ్చు! వివరాలు ఇవి..


Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏవయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు